లండన్: ఈస్ట్ ఇండియా కంపెనీలో సైనికుడిగా విధులు నిర్వర్తించిన ఓ భారతీయుడి పుర్రెను.. అతని మాతృభూమిలోనే ఖననం చేయాలంటూ ఓ బ్రిటన్ చరిత్రకారుడు డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 13తో 99 ఏళ్లు గడిచిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో మరణించిన సైనికుడి పుర్రెకు ఇండియాలో దహన సంస్కారాలు జరిపించాలని కోరుతున్నాడు డాక్టర్ కిమ్ వాగ్నర్. కిమ్ లండన్‌లోని క్వీన్ మేరీ కాలేజిలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2014లో జలియవాలా బాగ్ గురించి ఓ బుక్ రాయడానికి పరిశోధన మొదలు పెట్టారు.
ఆ క్రమంలో ఉన్న ఆయనకు ఒక స్టోర్‌రూమ్‌లో ఒక పుర్రె దొరికింది. దాని కళ్ల భాగంలో ఆ పుర్రెకు సంబంధించిన వివరాలతో కూడిన ఓ కాగితం కనిపించింది. అది తెరిచి చూడగా దానిలో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన భారతీయ సైనికుడు ఆలం బాగ్ పుర్రె అని, ఇతను 32 సంవత్సరాల వయసువాడని, 5 అడుగుల 7 అంగుళాలు ఎత్తు కలిగి ఉన్నాడు. అంతేగాక అతని కుటుంబం మొత్తాన్ని స్కాటిష్ మిషనరీలు చంపేశాయని రాసి ఉంది. ఇది చదివిన కిమ్ మరింత అధ్యయనం జరిపి వాగ్నర్ ద స్కల్ ఆఫ్ ఆలం బాగ్( ద లైఫ్ ఆండ్ డెత్ ఆఫ్ ఏ రెబల్ ఆఫ్ 1857) పేరిట పుస్తకాన్ని రాసి విడుదలచేశారు. అంతటితో ఆగకుండా ఆలం బాగ్‌ను మాతృభూమి మట్టిలోనే పూడ్చిపెట్టాలని న్యూఢిల్లీలోని బ్రిటన్ హై కమిషన్ ద్వారా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment