Keran sector
-
పాక్ కుట్రను తిప్పి కొట్టిన భారత్
శ్రీనగర్: భారత్‌లో పేలుళ్లే లక్ష్యంగా పాక్ పన్నిన కుట్రల్ని భారత ఆర్మీ భగ్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి కశ్మీర్‌లోని కెరాన్ సెక్టార్‌కు భారీ ఎత్తున ఆయుధాలు తరలించడానికి చేసిన ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టినట్టు సైనిక అధికారి ఒకరు వెల్లడించారు. కెరాన్ సెక్టార్లో నాలుగు ఏకే74 రైఫిళ్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కిషన్‌గంగ నది మీదుగా ఒక తాడు సాయంతో ఇద్దరు, ముగ్గురు దుండగులు ఒక పెద్ద ట్యూబులో ఆయుధాలను ఉంచి తరలిస్తుండగా జవాన్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి రైఫిల్స్, 8 మ్యాగజైన్స్‌తో పాటుగా రెండు పెద్ద సంచుల నిండా ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతమంతా అణువణువునా గాలిస్తున్నట్టుగా లెఫ్ట్‌నెంట్ జనరల్ బీఎస్ రాజు వెల్లడించారు. ‘అప్రమత్తంగా ఉంటూ పాక్ చేసిన ఏ పనినైనా తిప్పి కొడతాం’అని చెప్పారు. కెరాన్, టాంగ్ధర్, జమ్మూ, పంజాబ్ సెక్టార్లలో కశ్మీరీ యువతని ఉగ్రవాదం వైపు మళ్లించడానికి పాక్ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉందని ఆ కమాండర్ తెలిపారు. కాగా, కశ్మీర్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్ జిల్లాలోని చింగామ్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు సోదాలు చేపట్టాయి. నక్కి ఉన్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దదూరా ప్రాంతంలో ఇదే రీతిలో జరిగిన మరో ఎన్కౌంటర్లో కూడా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. -
పాక్ ‘బ్యాట్’ సైనికుల హతం
శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంబడి భారత్ సైనిక పోస్టులపైకి దాడికి దిగి, చొరబడేందుకు పాక్ సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో పాక్ బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ)లోని ఐదు నుంచి ఏడుగురు మృతి చెందారని సైన్యం తెలిపింది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో జూలై 31వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని సైన్యం అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. వీరిలో పాక్ కమాండోలతోపాటు ఉగ్రవాదులు కూడా ఉన్నారన్నారు. ఈ ఘటన అనంతరం పాక్ భారీగా సైన్యాన్ని మోహరించిందన్నారు. కశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణాన్ని, అమర్నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు పాక్ బలగాలు గత 36 గంటల్లో పలు ప్రయత్నాలు చేశాయని, అప్రమత్తమైన సైన్యం దీటుగా బదులిచ్చిందని కల్నల్ కాలియా చెప్పారు. అదేవిధంగా, శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు కరుడు గట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు. వారి నుంచి పాక్‌లో తయారైన స్నైపర్ రైఫిల్, ఐఈడీ మందుపాతరను స్వాధీనం చేసుకున్నామన్నా రు. బీఏటీలో సాధారణంగా పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్‌తోపాటు ఉగ్రవాదులు ఉంటారని ఆయన వివరించారు. నలుగురు జైషే ఉగ్రవాదుల హతం జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా, షోపియాన్ జిల్లాల్లో భద్రతా దళాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు జైషే మొహమ్మద్ (జేఎం) ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గత 36 గంటల్లో ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతమవ్వగా, మరో ఇద్దరు దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఆపరేషన్‌లో హతమైనట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. బారాముల్లా జిల్లా సోపోర్‌లోని వార్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా లభించిన సమాచారం మేరకు భద్రతా దళాలు శనివారం ఉదయం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. వారిలో ఒకరు బండిపోరాకు చెందిన ఉమర్ షాబాజ్‌గా గుర్తించారు. మరొకరి గుర్తింపు లభించలేదు. ఘటనా స్థలంనుంచి మందుగుండు సామగ్రి, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, షోపియాన్‌లోని పండూషన్ ప్రాంతంలో శుక్రవారం ప్రారంభమైన మరో ఆపరేషన్‌లో జైషే ఉగ్రవాదులు మంజూర్ భట్, జీనత్ ఇస్లాం నైకూలు హతమయ్యారని ఆ అధికారి తెలిపారు. నైకూ పాకిస్తాన్ జాతీయుడని, జైషే మహమ్మద్ జిల్లా కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు. -
ఆరుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దులు దాటి దేశం లోపలికి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన యత్నాన్ని సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వద్ద ఆదివారం అనుమానాస్పద కదలికలను పసిగట్టిన సైన్యం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన అనంతరం అక్కడి అటవీ ప్రాంతంలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు సైన్యం తెలిపింది. రంజాన్ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో సైనిక కార్యకలాపాలను కేంద్రం నిలిపివేసినప్పటికీ ఉగ్రవాదుల కదలికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కేరన్‌లో అప్రమత్తంగా భద్రతా సిబ్బంది -
కేరన్ సెక్టర్లో నలుగురు తీవ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్లో కెరన్ సెక్టర్లో భారత్‌లోకి చోరబడేందుకు యత్నించిన నలుగురు తీవ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ అధికారులు శనివారం వెల్లడించారు. ఆ ఘటన స్థలంలో ఆరు ఏకే 47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిన్న దేశంలో చోరబాటుకు యత్నించిన ముగ్గురు తీవ్రవాదులను హతమార్చినట్లు చెప్పారు. దాంతో భారత్, పాక్ సరిహద్దుల్లోని గస్తీని పెంచినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే గత 12 రోజులుగా దేశంలో తీవ్రవాదుల చోరబాట్లు అధికమైనాయని చెప్పారు. -
కాశ్మీర్లో ఇద్దరు తీవ్రవాదులు హతం
కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సమీపంలో భారత్‌లోకి అక్రమంగా చోరబాడుతున్న ఇద్దరు తీవ్రవాదులను భారత్ ఆర్మీ దళాలు కాల్చి చంపినట్లు రక్షణ శాఖ ప్రతినిధి శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. కెరన్ సెక్టర్ సమీపంలోని నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు తీవ్రవాదులు అక్రమంగా భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భారత్ ఆర్మీ దళాలు కాల్పులు జరిపాయని వివరించారు. గత 10 రోజుల నుంచి దాదాపు 40 మంది చోరబాటు దారులు కెరన్ సెక్టర్ ద్వారా భారత్‌లో ప్రవేశించారని చెప్పారు. వారిలో15 మందిని ఇప్పటి వరకు భద్రత దళాలు కాల్చి చంపాయన్నారు. అయితే నియంత్రణ రేఖ దాటి ఎవరు భారత్‌లో ప్రవేశించకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు.