శ్రీనగర్లో ఎన్కౌంటర్: తీవ్రవాది మృతి | Militant killed in overnight encounter | Sakshi
Sakshi News home page

శ్రీనగర్లో ఎన్కౌంటర్: తీవ్రవాది మృతి

Published Sun, Oct 11 2015 11:55 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

Militant killed in overnight encounter

శ్రీనగర్ : ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో హంద్వారా ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఓ తీవ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు భద్రతాదళాల ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. సదరు ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారని భద్రతదళాలకు శనివారం సాయంత్రం సమాచారం అందింది.

దీంతో భద్రత దళాలు అటవీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. ఆ విషయం గమనించిన తీవ్రవాదులు ... భద్రత దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దాంతో వెంటనే అప్రమత్తమైన దళాలు ఎదురు కాల్పులు జరిపాయి.  నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు జరిగిని ఈ ఎన్కౌంటర్లో ఓ తీవ్రవాది మృతి చెందాడని ఉన్నతాధికారి తెలిపారు. అయితే భద్రత దళాల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement