కోర్టులోనే అబ్దుల్ కరీమ్ టుండాపై దాడి, పోలీస్ కస్టడీ విధింపు!
కోర్టులోనే అబ్దుల్ కరీమ్ టుండాపై దాడి, పోలీస్ కస్టడీ విధింపు!
Published Tue, Aug 20 2013 5:19 PM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్ కరీమ్ టుండాను పది రోజల కస్టడీకి సిటీ కోర్టు నుంచి ఢిల్లీ పోలీసులు అనుమతి తీసుకున్నారు. పోలీసు కస్టడీ విధించడానికి ముందు టుండాపై కోర్టు రూమ్ లో అడ్వకేట్ దాడి ఘటన గందరగోళం సృష్టించడంతో టుండాను రహస్యంగా విచారించారు.
టుండాను కట్టుదిట్టమైన భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టు లో ప్రవేశపెట్టారు. అయితే కోర్టు ప్రాంగణంలోనే హిందు సేనా అధ్యక్షుడు విష్ణు గుప్తా చెంప దెబ్బ కొట్టడంతో కోర్టు లో గందరగోళం నెలకొంది. దేశంలో సుమారు 40 ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుళ్లలో సంబంధమున్నట్టు కేసులు నమోదయ్యాయి.
20 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో జాబితాలో టుండా ఒకరు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో టుండా నిందితుడుగా ఉన్నాడు. దావూద్ ఇబ్రహీంకు అతిసన్నిహితుడైన టుండాను భారత, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉత్తరఖండ్ లోని బాన్ బసా ప్రాంతంలో శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement