ఇరాక్ పరిణామాలపై కేసీఆర్ ఆరా
హైదరాబాద్ : ఇరాక్ పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. అక్కడ పరిణామాలపై వివరాలు తెలుసుకోవాలని ఆయన మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ఇరాక్ పరిణామాలపై విదేశాంగ శాఖతో సీఎస్ రాజీవ్ శర్మ సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా ఇరాక్లో ఉన్న తెలుగువారి పరిస్థితిపై ఆయన ఆరా తీస్తున్నారు.
కాగా ఇరాక్‌లో మిలిటెంట్లకు, ప్రభుత్వ బలగాలకు మధ్య హోరాహోరీ ఘర్షణలు సాగుతున్నాయి. సిరియా సరిహద్దులోని వ్యూహాత్మక షియా పట్టణం తల్ అఫర్‌పై పట్టుకోసం ఇరు పక్షాలు భీకరంగా తలపడ్డాయి. మిలిటెంట్లు కొన్ని గంటలపాటు పట్టణంపై దాడి చేసి తల్‌అఫర్‌ను స్వాధీనం చేసుకున్నాయి. కాల్పులు, పేలుళ్లకు బెదిరిన స్థానికులు పెద్ద సంఖ్యలో వలస పోతున్నారు.