Iraq Militants
-
అరబ్ దేశాల ఆగ్రహం... అమెరికాకు తీవ్ర హెచ్చరిక
తెహ్రాన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరూసలేం ప్రకటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఉగ్రవాదులను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారంటూ చెప్పుకుంటున్న నేపథ్యంలోనే ఓ గట్టి వార్నింగ్ వచ్చి పడింది. ఇరాక్‌కు చెందిన అల్-నొజాబా అనే మిలిటెంట్ సంస్థ తమ దేశంలో మోహరించిన అమెరికా సైన్యంపై ఏ క్షణంలోనైనా దాడి చేస్తామని ప్రకటించింది. ఈ ఉగ్రవాద సంస్థ చీఫ్ అక్రమ్ అల్ కాబీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాడు. 2013లో ప్రారంభమైన ఈ సంస్థ 1500 మంది సైన్యంతో ఐసిస్‌తో కలిసి సైన్యానికి వ్యతిరేకంగా పని చేస్తోంది. సుమారు 6 వేల మంది అమెరికా సైనికులు మోహరించినట్లు పెంటగాన్ వెల్లడించగా.. ఆ సంఖ్య 9 వేల దాకా ఉండొచ్చన్న మరో అంచనా ఉంది. కాగా, ట్రంప్ వ్యాఖ్యలతో వారందరికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. టెల్ అవివ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించేందుకు అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ట్రంప్ చేసిన ప్రకటనను అరబ్ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. భారత్ తటస్థం... ? పాలస్తీనా విషయంలో తాము తీసుకునే నిర్ణయాలు స్వతంత్రంగా, స్థిరంగా ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తించడంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ భారత్ తరఫున ప్రకటన చేశారు. భారత్ తన అభిప్రాయాలు, ఆసక్తులకు అనుగుణంగానే ఉంటుందని, దీన్ని ఏ మూడో దేశం నిర్ణయించబోదని తేల్చి చెప్పారు. -
160 మంది బందీల ఊచకోత
ఇరాక్ మిలిటెంట్ల ఘాతుకం హ్యూమన్ ైరె ట్స్ వాచ్ వెల్లడి బాగ్దాద్: ఇరాక్ మిలిటెంట్ల మారణకాండను హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ధ్రువీకరించింది. మిలిటెంట్లు ఈ నెల 11-14 మధ్య తిక్రిత్ నగరంలో 160 మందికిపైగా బందీలను హతమార్చారని శుక్రవారం వెల్లడించింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, మిలిటెంట్లు విడుదల చేసిన ఫొటోల ఆధారంగా ఈ సంగతి తెలుస్తోందని పేర్కొంది. మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని, అయితే మృతదేహాలున్న ప్రాంతాలను గుర్తించడం కష్టమవుతోందని సంస్థ ప్రతినిధి పీటర్ బొకేర్ట్ ఓ ప్రక టనలో పేర్కొన్నారు. ఉత్తర ఇరాక్‌లో పలు ప్రాంతాలను చేజిక్కించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్ఐఎల్) జిహాదీలు తాము పట్టుకున్న సైనికులను నేలపై పడుకోబెట్టి కాల్చి చంపుతున్నట్లున్న ఫొటోలను వెబ్సైట్లో పెట్టడం తెలిసిందే. -
ఇరాక్ పరిణామాలపై కేసీఆర్ ఆరా
హైదరాబాద్ : ఇరాక్ పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. అక్కడ పరిణామాలపై వివరాలు తెలుసుకోవాలని ఆయన మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ఇరాక్ పరిణామాలపై విదేశాంగ శాఖతో సీఎస్ రాజీవ్ శర్మ సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా ఇరాక్‌లో ఉన్న తెలుగువారి పరిస్థితిపై ఆయన ఆరా తీస్తున్నారు. కాగా ఇరాక్‌లో మిలిటెంట్లకు, ప్రభుత్వ బలగాలకు మధ్య హోరాహోరీ ఘర్షణలు సాగుతున్నాయి. సిరియా సరిహద్దులోని వ్యూహాత్మక షియా పట్టణం తల్ అఫర్‌పై పట్టుకోసం ఇరు పక్షాలు భీకరంగా తలపడ్డాయి. మిలిటెంట్లు కొన్ని గంటలపాటు పట్టణంపై దాడి చేసి తల్‌అఫర్‌ను స్వాధీనం చేసుకున్నాయి. కాల్పులు, పేలుళ్లకు బెదిరిన స్థానికులు పెద్ద సంఖ్యలో వలస పోతున్నారు.