160 మంది బందీల ఊచకోత
ఇరాక్ మిలిటెంట్ల ఘాతుకం హ్యూమన్ ైరె ట్స్ వాచ్ వెల్లడి
బాగ్దాద్: ఇరాక్ మిలిటెంట్ల మారణకాండను హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ధ్రువీకరించింది. మిలిటెంట్లు ఈ నెల 11-14 మధ్య తిక్రిత్ నగరంలో 160 మందికిపైగా బందీలను హతమార్చారని శుక్రవారం వెల్లడించింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, మిలిటెంట్లు విడుదల చేసిన ఫొటోల ఆధారంగా ఈ సంగతి తెలుస్తోందని పేర్కొంది. మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని, అయితే మృతదేహాలున్న ప్రాంతాలను గుర్తించడం కష్టమవుతోందని సంస్థ ప్రతినిధి పీటర్ బొకేర్ట్ ఓ ప్రక టనలో పేర్కొన్నారు.
ఉత్తర ఇరాక్‌లో పలు ప్రాంతాలను చేజిక్కించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్‌ఐఎల్) జిహాదీలు తాము పట్టుకున్న సైనికులను నేలపై పడుకోబెట్టి కాల్చి చంపుతున్నట్లున్న ఫొటోలను వెబ్‌సైట్‌లో పెట్టడం తెలిసిందే.