జమ్మూ కాశ్మీర్లోని పూల్వామా రీజియన్ లో శనివారం తెల్లవారుజాము నుంచి అటు భద్రత దళాలకు, ఇటు ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరగుతున్నాయి. ఈ సందర్బంగా భద్రత దళాలు జరిపిన కాల్పులలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ ఉగ్రవాది మరణించాడు. ఆ కాల్పులలో మరికొంత మంది తీవ్రవాదులు తీవ్రంగా గాయపడి ఉంటారని భద్రత సిబ్బంది వెల్లడించారు. అయితే భద్రత సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య పోరు ఇంకా కొనసాగుతునే ఉంది.
పూల్వామా రీజియన్ లోని మారుమూల ప్రాంతంలో తీవ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందటంతో భద్రతా దళాలు అక్కడికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ విషయాన్ని గమనించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా భద్రత దళాలపై కాల్పులకు తెగబడ్డాయి. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఉగ్రవాదులపైకి తుపాకి గుళ్ల వర్షం కురిపించారు. ఆ దాడిలో ఉగ్రవాది మరణించారు.