exchange fire
-
ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధి పూజారి కాంకేర్– నంబి సమీపాన కర్రిగుట్టల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున కర్రిగుట్ట అడవుల్లో బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నడుమ గంటసేపు ఎదురుకాల్పులు కొనసాగాయి. అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒక ఏకే–47, ఒక మెషీన్‌గన్, ఒక 12 బోర్ తుపాకీతో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి, ఔషధా లు, నిత్యావసర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. మృతుల్లో ఒకరిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకు‹Ùపూర్ గ్రామానికి చెందిన అన్నె సంతోష్ అలియాస్ శ్రీధర్ అలియాస్ సాగర్‌గా గుర్తించారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడైన(ఎస్సీఎం) సాగర్.. సెంట్రల్ రీజియన్ కమాండ్(సీఈసీ)కు డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు. ఇతనిపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరినీ గుర్తించాల్సి ఉంది. -
Manipur: భద్రతా బలగాలపైకి మిలిటెంట్ల దాడులు
ఇంఫాల్: జాతుల వైరంతో ఘర్షణలమయమైన మణిపూర్‌లో ఈసారి భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్లకు మధ్య పరస్పర కాల్పుల పర్వం కొనసాగుతోంది. తొలుత మయన్మార్ సరిహద్దులోని మోరె పట్టణంలో భద్రతా బలగాల పోస్ట్‌పై మిలిటెంట్లు దాడి చేయడంతో ఈ ఎదురుకాల్పులు మొదలయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో మోరె సబ్‌డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చంగ్థమ్ ఆనంద్‌ను కుకీ మిలిటెంట్లు హత్య చేసిన ఘటనలో మంగళవారం మోరె పట్టణంలో పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌చేశారు. ఈ అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొందరు మహిళల బృందం పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మోరె పట్టణంలోని భద్రతాబలగాల పోస్ట్‌పై కాల్పులు జరిపారు. రాకెట్ ఆధారిత గ్రనేడ్లు విసిరారు. బలగాల పోస్ట్ వద్ద వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. వెంటనే తేరుకున్న బలగాలు మిలిటెంట్లపై కాల్పులు జరిపాయి. మోరె పట్టణం సహా ఛికిమ్ గ్రామంలో, వార్డ్ నంబర్ ఏడులోనూ ఇలా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఒక ఆలయం సమీపంలో మిలిటెంట్లు జరిపిన మెరుపుదాడిలో స్టేట్ పోలీస్ కమాండో వాంగ్కెమ్ సోమర్జిత్ మరణించారు. మరో చోట జరిపిన కాల్పుల్లో మరో పోలీస్ తఖెల్లబమ్ శైలేశ్వర్ ప్రాణాలు కోల్పోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో తెంగ్నౌపాల్ జిల్లాలో మణిపూర్ సర్కార్ కర్ఫ్యూను విధించింది. ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ మేజి్రస్టేట్ తొమ్మిది రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. హెలికాప్టర్లు ఇప్పించండి రోడ్డు మార్గంలో బలగాల తరలింపు సమయంలో మిలిటెంట్ల మెరుపుదాడుల నేపథ్యంలో బలగాల తరలింపు, మొహరింపు, క్షతగాత్రుల తరలింపు, వైద్య సేవల కోసం హెలికాప్టర్లను ఇవ్వాలని కేంద్ర హోం శాఖను మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అభ్యరి్థంచింది. రాష్ట్రంలో మళ్లీ మొదలైన ఘర్షణలు, ఉద్రిక్తతలపై ముఖ్యమంత్రి బీరెన్æ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తాజా ఉద్రిక్తతల్లో మయన్మార్ శక్తుల ప్రమేయం ఉండొచ్చని సీఎం అనుమానం వ్యక్తంచేశారు. -
కశ్మీర్లో ముగిసిన ఎన్కౌంటర్..
రాజౌరీ/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గురువారం రెండో రోజు కూడా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. బుధవారం ఎన్కౌంటర్ గాయపడిన ఇద్దరు జవాన్లలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని అధికారులు తెలిపారు. దీంతో, ఈ ఎన్కౌంటర్ అసువులు బాసిన జవాన్ల సంఖ్య అయిదుగురుకు చేరుకుంది. బుధవారం చనిపోయిన వారిని కెప్టెన్ ఎంవీ ప్రాంజల్(కర్ణాటక), కెప్టెన్ శుభమ్ గుప్తా(యూపీ), పారా ట్రూపర్ సచిన్ లౌర్(యూపీ), హవల్దార్ అబ్దుల్ మాజిద్(జమ్మూకశ్మీర్)గా గుర్తించారు. గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ధర్మసాల్లోని బాజిమాల్ ప్రాంతంలో బుధవారం ఎన్కౌంటర్ సందర్భంగా ఇద్దరు కెప్టెన్లు సహా నలుగురు జవాన్లు నేలకొరిగారు. మరో ఇద్దరు గాయాలపాలైన విషయం తెలిసిందే. రాత్రి వేళ కాల్పులను నిలిపివేసిన బలగాలు ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశం లేకుండా, అక్కడి దట్టమైన అటవీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో దిగ్బంధించాయి. గురువారం ఉదయం తిరిగి రెండు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ ముగిసినట్లయిందని తెలిపారు. మృతుల్లో ఒకరిని పాకిస్తాన్‌కు చెందిన పేరుమోసిన ఉగ్రవాది క్వారీగా గుర్తించారు. మందుపాతరలను అమర్చడం, స్నైపర్ కాల్పుల్లోనూ ఇతడు నిపుణుడు. గుహల్లో ఉంటూ ఉగ్ర చర్యలకు పాల్పడుతుంటాడు. పాక్, అఫ్గానిస్తాన్‌లలో ఉగ్ర శిక్షణ పొందిన క్వారీ లష్కరే తోయిబాలో టాప్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. హతమైన మరో ముష్కరుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
మావోయిస్టుల కాల్పులు.. ఇద్దరు కార్మికులు మృతి
సాక్షి, ఛత్తీస్‌గఢ్: నారాయణపూర్ అంబైడ్‌గనిలో మావోయిస్టుల దాడికి పాల్పడ్డారు. జేసీబీ సహా 6 వాహనాలను మావోయిస్టులు తగలబెట్టారు. సూపర్వైజర్ సహా కార్మికులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. కార్మికుల కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా యత్నించాయి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. -
తృటిలో తప్పించుకున్న ఆర్కే!
మల్కన్‌గిరి/సీలేరు (విశాఖ ఏజెన్సీ): ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి జోడాంబు పంచాయతీ పరిధిలోని సిమిలిపోదర్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే తృటిలో తప్పించుకు న్నారు. ఉదయం 9 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఆర్కేతోపాటు మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు పరారయ్యారని చెప్పారు. పోలీసులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఒడిశా డీజీపీ ఆర్పీ శర్మ మాట్లాడుతూ మావోయిస్టుల అణచివేతకు ఛత్తీస్ గఢ్, ఆంధ్ర పోలీసులతో కలిసి ఒడిశా పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. 2016లో రాయగఢ్ ప్రాంతంలో 34 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారని తెలిపారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దు ల్లో భారీ ఎన్కౌంటర్లు జరిపి 38 మంది మావోయిస్టులను హతమార్చా మని తెలిపారు. మావోయి జాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం నవీన్ పట్నాయక్ మావోయిస్టులకు పిలుపునిచ్చారని తెలిపారు. అందుకోసమే ఆపరేషన్ ఆలౌట్‌ను మల్కన్‌గిరి జిల్లా నుంచి ప్రారంభించామని స్పష్టం చేశారు. దీనికోసం గురువారం హెలికాప్టర్లతో సర్వే కూడా చేయించామన్నారు. మల్కన్‌గిరిలో క్యాంప్‌లను నిర్వహిస్తామని చెప్పారు. కాగా ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి 303 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్
పాలక్కడ్ : కేరళ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య శనివారం హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి రమేశ్ చన్నీతాల వెల్లడించారు. అట్టపడ్డి అటవీ ప్రాంతంలో గస్తీ పోలీసులకు ఐదుగురు మావోయిస్టులు తారసపడ్డారు. ఆ క్రమంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని చెప్పారు. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారని... దీంతో ఇరువైపులా హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందిన విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు మంత్రి రమేశ్ నిరాకరించారు. ఈ కాల్పుల్లో పోలీసులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పాలక్కడ్ జిల్లా కలెక్టర్ మేరీ కుట్టి స్పష్టం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో పోస్టర్లు, ప్రచార సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అటవీ ప్రాంతంలో భారీగా బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
విశాఖ జిల్లాలో ఎదురు కాల్పులు
విశాఖ : విశాఖ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం జీడీపాలెంలో దగ్గర అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కూంబింగ్ జరుపుతున్న సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దాంతో పోలీసులు ప్రతిగా ఎదురు కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు కాల్పులు హోరాహోరీగా జరిగినట్లు సమాచారం. కాగా ఎదురు కాల్పుల్లో దళ కమాండర్ కుడుముల రవి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారంతో కూంబింగ్ దళాలు అప్రమత్తం అయ్యాయి. మరోవైపు మావోయిస్టు అగ్రనేత తప్పించుకున్నట్లు వచ్చిన వార్తలను పోలీసు అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆదిలాబార్ జిల్లాలో అన్నల అలజడి
-
భద్రత దళాల కాల్పులలో జైషే మహ్మద్ ఉగ్రవాది హతం
జమ్మూ కాశ్మీర్‌లోని పూల్వామా రీజియన్ లో శనివారం తెల్లవారుజాము నుంచి అటు భద్రత దళాలకు, ఇటు ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరగుతున్నాయి. ఈ సందర్బంగా భద్రత దళాలు జరిపిన కాల్పులలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ ఉగ్రవాది మరణించాడు. ఆ కాల్పులలో మరికొంత మంది తీవ్రవాదులు తీవ్రంగా గాయపడి ఉంటారని భద్రత సిబ్బంది వెల్లడించారు. అయితే భద్రత సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య పోరు ఇంకా కొనసాగుతునే ఉంది. పూల్వామా రీజియన్ లోని మారుమూల ప్రాంతంలో తీవ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందటంతో భద్రతా దళాలు అక్కడికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ విషయాన్ని గమనించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా భద్రత దళాలపై కాల్పులకు తెగబడ్డాయి. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఉగ్రవాదులపైకి తుపాకి గుళ్ల వర్షం కురిపించారు. ఆ దాడిలో ఉగ్రవాది మరణించారు.