మృతుల్లో ఒకరు భూపాలపల్లి జిల్లా వాసి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధి పూజారి కాంకేర్– నంబి సమీపాన కర్రిగుట్టల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ, గ్రేహౌండ్స్ పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున కర్రిగుట్ట అడవుల్లో బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నడుమ గంటసేపు ఎదురుకాల్పులు కొనసాగాయి.
అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒక ఏకే–47, ఒక మెషీన్‌గన్, ఒక 12 బోర్ తుపాకీతో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి, ఔషధా లు, నిత్యావసర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. మృతుల్లో ఒకరిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకు‹Ùపూర్ గ్రామానికి చెందిన అన్నె సంతోష్ అలియాస్ శ్రీధర్ అలియాస్ సాగర్‌గా గుర్తించారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడైన(ఎస్‌సీఎం) సాగర్.. సెంట్రల్ రీజియన్ కమాండ్(సీఈసీ)కు డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు. ఇతనిపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరినీ గుర్తించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment