బాగ్దాద్: ఇరాక్ సంక్షోభం తార స్థాయికి చేరుకుంటోంది. ఆ దేశంలో అంతర్యుద్ధ్యం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇరాక్లో కొన్ని పట్టణాలను స్వాధీనం చేసుకున్న తీవ్రవాదులు బుధవారం ఉదయం అతిపెద్ద ఆయిల్ రీఫైనరీపై దాడి చేశారు. బాగ్దాద్కు ఉత్తరాన ఉన్న సలాహెద్దిన్ ప్రావిన్స్లోని బైజీ రీఫైనరీలో ఈ సంఘటన జరిగింది. కాగా ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో బైజీ రీఫైనరీని ఇంతకుముందే మూసివేసి ఉద్యోగులను అక్కడి నుంచి ఖాలీ చేయించారు. తీవ్రవాదులు ఆయిల్ రీఫైనరీలో కొన్ని ట్యాంకర్లను పేల్చివేశారు.
ఇరాక్ భూభాగాన్ని ఆక్రమించుకోవడమే లక్ష్యంగా తీవ్రవాదులు దాడులు చేస్తున్నారు. సలాహెద్దిన్ ప్రావిన్స్లో అత్యధిక పట్టణాలను ఉగ్రవాదులు ఆక్రమించారు. మొసుల్ పట్టణంలో ఉన్న 40 మంది భారతీయుల ఆచూకీ తెలియడం లేదు. వారిని రక్షించడం కోసం భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఇరాక్లో అతిపెద్ద ఆయిల్ రీఫైనరీపై దాడి
Published Wed, Jun 18 2014 1:48 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM
Advertisement