ఎమ్మెల్యే ఎస్కార్ట్‌పై ఉగ్ర కాల్పులు
శ్రీనగర్: జుమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులను పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం అనంతనాగ్ నుంచి షోపైన్‌కు వెళ్తున్న ఎమ్మెల్యే మహ్మద్ యూసఫ్‌కు ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసు వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎమ్మెల్యేది బుల్లెట్ ఫ్రూఫ్ కారు కావడంతో ఎమ్మెల్యేకు ఏమి కాలేదని పోలీసులు తెలిపారు. అయితే వాహనాలు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నాయి.