శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ సరిహద్దులో భారీ దాడికి పాకిస్థాన్ ఉగ్రవాదులు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 7.40గంటల ప్రాంతంలో భారీ మొత్తంలో ఆయుధాలు ధరించిన ముగ్గురు ఉగ్రవాదులు తాంఘ్దార్ సెక్టార్ సమీపంలోని ఆర్మీ క్యాంపు వద్దకు చేరుకొని కాల్పులు ప్రారంభించారు. ఈ దాడితో ఉలిక్కిపడిన భారత ఆర్మీ కూడా ప్రతి దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో భారత ఆర్మీకి చెందిన ఆయిల్ డిపో మంటల్లో చిక్కుకుంది. ఉగ్రవాదులు దాడికి దిగిన విధానాన్ని బట్టి భారీ విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. ఆత్మాహుతి దాడి చేసేందుకు వచ్చారా అనే అనుమానం కలిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నాయి.
మరోపక్క, జమ్మూకాశ్మీర్ లోని ఫూంచ్ జిల్లాలో కొందరు ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు గుర్తించారు. మంగళవారం రాత్రి జరిపిన గాలింపు చర్యల్లో భారత ఆర్మీకి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యం అయ్యాయి. వీటిలో ఒక ఏకే 47 గన్, 113 రౌండ్లకు సరిపోయే బుల్లెట్లు, పికా మందుగుండు, రెండు ఐఈడీలు, ఒక చైనా గ్రనేడ్, పాకిస్థాన్ సిమ్ కార్డులు, కరెన్సీ ఉన్నాయి. ఆర్మీ అలికిడి వారు ఆ వస్తువులు అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం.
సరిహద్దులో ఉగ్రవాదుల మెరుపుదాడి
Published Wed, Nov 25 2015 9:36 AM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM
Advertisement