కరాచీ: పాకిస్థాన్లో ఉగ్రవాదుల దాష్టీకం రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఇప్పటి వరకు భారత్వంటి పొరుగు దేశాలపై అక్రమ దాడులకు పాల్పడుతున్న ఆ దేశ ఉగ్రవాదులు తమ మాతృదేశాన్ని సైతం వదలడం లేదు. ఆదివారం భారీ మొత్తంలో ఆయుధాలు ధరించి బైక్లపై వచ్చిన 12మంది ఉగ్రవాదులు గ్వాదర్ జిల్లాలోని జివానీ విమానాశ్రయంపై విరుచుకుపడ్డారు. కాల్పులు జరుపుతూ, మోటార్ షెల్స్ విసురుతూ భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. ఎయిర్ పోర్ట్లోని రాడార్ను ధ్వంసం చేశారు.
ఓ ఎలక్ట్రానిక్ ఇంజినీర్ను హతమార్చి మరొకరిని ఎత్తుకెళ్లారు. ఈ నగరంలోనే త్వరలో చైనా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టనుండగా ఈ ఘటన చోటుచేసుకోవడం ఆ దేశ పాలకులను ఆలోచింపజేస్తోంది. ఈ విమానాశ్రయం పాకిస్థాన్-ఇరాన్ తీరప్రాంత సరిహద్దులో ఉంది. విమానాశ్రయం వద్ద తక్కువ రక్షణా సిబ్బంది ఉందని, అందుకే వారు దాడి చేసి పారిపోగలిగారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ దాడిని బాలోచిస్తాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ మాలిక్ బాలోక్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈప్రాంతంలో విమానాశ్రయంపై దాడి చోటుచేసుకుంది.
పాక్ ఎయిర్ పోర్ట్పై ఉగ్ర దాడి
Published Sun, Aug 30 2015 4:57 PM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement
Advertisement