కాశ్మీర్లో ఎన్కౌంటర్ : తీవ్రవాదుల హతం | Two militants killed in Kashmir gunfight | Sakshi
Sakshi News home page

కాశ్మీర్లో ఎన్కౌంటర్ : తీవ్రవాదుల హతం

Published Fri, Mar 18 2016 10:04 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

కాశ్మీర్లో ఎన్కౌంటర్ : తీవ్రవాదుల హతం

కాశ్మీర్లో ఎన్కౌంటర్ : తీవ్రవాదుల హతం

శ్రీనగర్ : కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భద్రత దళాలు... గెరిల్లాల మధ్య శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు వేర్పాటు వాద తీవ్రవాదులు మరణించారు. ఈ మేరకు సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. బీగ్ మోహల్లా ప్రాంతంలోని ఓ ఇంట్లో తీవ్రవాదలు దాక్కుని ఉన్నట్లు భద్రత దళాలకు సమాచారం అందింది. దీంతో సదరు ఇంటిని భద్రత దళాలు చుట్టుముట్టాయి. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఇరువైపులా భీకర పోరు జరిగింది. ఆ క్రమంలో భద్రత దళాలు కాల్పులో ఇద్దరు తీవ్రవాదులు మరణించారు. అయితే ఈ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement