
భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదుల హతం
జమ్మూ కశ్మీర్: దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య గురువారం తెల్లవారుజామున హోరా హోరిగా కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదుల హతమయ్యారని ఆర్మీ అధికారులు తెలిపారు.
వీరు టెర్రరిస్టు గ్రూపు హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన వారుగా గుర్తించారు. మరికొందరు టెర్రరిస్టులు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.