ఉగ్రవాదులు అనుకొని టూరిస్టులను వేటాడి..
కైరో: ఈజిప్టు భద్రతా బలగాలు ఘోర తప్పిదానికి పాల్పడ్డాయి. ఉగ్రవాదులను హతమార్చేందుకు వారిని వెంటాడుతూ ఆ క్రమంలో పన్నెండు మంది పర్యాటకులను అనుకోకుండా కాల్చి చంపారు. ఈ ఘటన సంచలనానికి తెరతీసింది. పోలీసులు, సైనిక దళాలు ఆదివారం సాయంత్రం ఉమ్మడి ఉగ్రవాద నిరోధక చర్యలకు దిగాయి.
ఈ క్రమంలో ఏడారిలో నిషేధిత ప్రాంతమైనా అల వాహత్లో నాలుగు వాహనాల్లో మెక్సికన్, ఈజిప్టు టూరిస్టులు అనుకోకుండా వచ్చారు. దీంతో అప్పటి వరకు ఉగ్రవాదులను వెంటాడిన భద్రతా బలగాలు ఆ తర్వాత కూడా వారు ఉగ్రవాదులే అనుకుని భ్రమపడి మెక్సికో పర్యాటకుల వాహనాలపై కాల్పులు జరిపారు. దీంతో 12 మంది మెక్సికో, ఈజిప్టు టూరిస్టులు ప్రాణాలు కోల్పోగా మరో పది మంది గాయాలపాలయ్యారు. ఈజిప్టుకు ప్రధాన ఆదాయం టూరిజం నుంచి వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన కొంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అయితే, మెక్సికో మాత్రం ఈ అంశాన్నిఇంకా ధృవీకరించలేదు. ఇద్దరు మెక్సికన్లు మాత్రం చనిపోయినట్లు సమాచారం ఉందని తెలిపింది.