ఈజిప్టు సైన్యం ఉగ్రవాదులను మట్టుబెట్టింది. సినాయ్లో 13 మందిని వెంటాడి వేటాడి హతమార్చింది.
కైరో: ఈజిప్టు సైన్యం ఉగ్రవాదులను మట్టుబెట్టింది. సినాయ్లో 13 మందిని వెంటాడి వేటాడి హతమార్చింది. ఓ భారీ విధ్వంసానికి వారు పాల్పడేందుకు ప్రయత్నిస్తుండగా కనిపెట్టి మరీ వారి వ్యూహాన్ని సమర్థంగా తిప్పికొట్టింది. అక్కడి ఓ పత్రిక వివరాల ప్రకారం పశ్చిమ ఆరిశ్లోని జువెయిడ్ నగరంలోని విమానాశ్రయంలో భారీ పేలుళ్లకు పాల్పడేందుకు ప్రయత్నించారు. దాంతోపాటు ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసేందుకు సిద్ధమయ్యాడు.
ఈ రెండింటిని ముందే పసిగట్టిన సైన్యం ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టడంతోపాటు విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న ఉగ్రవాదులను వెంబడించి మొత్తం 13 మందిని హతమార్చింది. చనిపోయిన ఉగ్రవాదులు అల్ కాయిదా ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ అన్సార్ బయత్ మాక్దిస్(ఏబీఎం)కు చెందిన వారిగా భావిస్తున్నారు. ముందు నుంచే ఉగ్రవాదులను అణిచే విషయంలో ఈజిప్టు చాలా క్రీయాశీలకంగా పనిచేస్తోంది.