ఆర్మీ కార్యాలయంపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్: జమ్మూ కశ్మీర్ యురీ సెక్టార్‌లోని ఆర్మీకార్యాలయంపై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. నలుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు సమాచారం. భద్రతా బలగాలే లక్ష్యంగా యురీ సెక్టార్‌లోని ఆర్మీకార్యాలయంలోకి ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు. ఉగ్రదాడిలో 17మంది జవానులు మృతిచెందగా, 20 మందికి గాయాలయ్యాయి. భీకరంగా సాగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.
♦ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా, అమెరికాపర్యటనలను వాయిదా వేసుకొని సంబంధిత ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు.
♦ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాల్లోకి హెలీకాప్టర్ల ద్వారా ఆర్మీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
♦ గాయపడిన జవాన్లను శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ ఆసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.