పాకిస్థాన్లోని బెలుచిస్థాన్లో కిడ్నాప్నకు గురైన 23 మంది ప్రయాణికుల్లో 13 మందిని తీవ్రవాదులు హతమార్చారని మీడియా వెల్లడించింది. మంగళవారం ఉదయం వారి మృతదేహాలను పోలీసులు కనుగోన్నారని తెలిపింది. కాగా మరో 10 మంది ప్రయాణికుల ఆచూకీ ఇంతవరకు తెలియలేదని పేర్కొంది. ఆ ప్రయాణికుల ఆచూకీ వెంటనే కనిపెట్టాలని బెలుచిస్థాన్ ప్రావెన్స్ సీఎం అబ్దుల్ మాలిక్ బెలుచి ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్పింది. అలాగే ఆ ఘాతుకానికి ఒడిగట్టిన తీవ్రవాదులను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని ఆయన జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారని తెలిపింది. అయితే భద్రతా సిబ్బంది లేకపోవడంతో తీవ్రవాదులు ఆ రెండు బస్సుల్లోని ప్రయాణికులను ఆపి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని అధికారులు అభిప్రాయపడతున్నారని పేర్కొంది.
సోమవారం అర్థరాత్రి క్విట్టా నుంచి పంజాబ్ ప్రావెన్స్కు వెళ్లున్న రెండు బస్సులను భద్రత దళానికి చెందిన దుస్తులు ధరించిన సాయుధ బృందం బలవంతంగా నిలిపివేసింది. అనంతరం ఆ బస్సులోకి ప్రవేశించి ప్రయాణికులు తమ గుర్తింపుకార్డులు చూపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రయాణికులందరిని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. కాగా మంచ్ ప్రాంతంలో ఆ రెండు బస్సులను తీవ్రవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఆ బస్సుల వెంట ఉన్న భద్రత సిబ్బంది తీవ్రవాదుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో భద్రత సిబ్బంది, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ భద్రత సిబ్బంది మరణించగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని భద్రత సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు.
పాకిస్థాన్లో తీవ్రవాదుల ఘాతుకం
Published Tue, Aug 6 2013 2:01 PM | Last Updated on Sat, Mar 23 2019 8:41 PM
Advertisement