పాకిస్తాన్‌లో కాంగో వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా క్వెట్టాలో మరో కేసు నమోదైంది. 32 ఏళ్ల ఫాతిమా జిన్నా.. కాంగో వైరస్ బారిన పడి ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఏఆర్‌వై న్యూస్ పాకిస్తాన్‌లో వ్యాప్తిచెందుతున్న కాంగో వైరస్ కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్తాన్‌లో 13 కాంగో వైరస్ కేసులు నమోదయ్యాయి. పెషావర్‌లో కాంగో వైరస్ బారిన పడిన 18 ఏళ్ల యువకుడు మృతిచెందాడు. అయితే అతనితో పరిచయం కలిగినవారికి వైరస్ సోకిందీ లేనిదీ తెలియరాలేదు. ఈ వ్యాధి టిక్-బర్న్ నైరో వైరస్ వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ పశువులు, మేకలు, గొర్రెలు, కుందేళ్లు తదితర జంతువుల ద్వారా వ్యాపిస్తుంది.
కాంగో వైరస్ లక్షణాలివే..
జ్వరం, కండరాల నొప్పి, తల తిరగడం, మెడ నొప్పి, వెన్నునొప్పి, కళ్లు మండటం, ఫోటోఫోబియా, వికారం, వాంతులు, అతిసారం, కడుపు నొప్పి, గొంతు నొప్పి మొదలైనవి కాంగో వైరస్ లక్షణాలు.
Comments
Please login to add a commentAdd a comment