ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు మరో కొత్త సమస్యలో చిక్కుకున్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్తాన్ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఈ కేసు నమోదు చేసింది. సోషల్ మీడియాను ఉపయోగించి, ప్రభుత్వ అధికారులను తిరుగుబాటుకు ప్రేరేపించారంటూ ఖాన్‌పై ఈ కేసు నమోదు చేశారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో వివాదాస్పద పోస్ట్‌కు సంబంధించి ప్రశ్నించడానికి దర్యాప్తు, సాంకేతిక అధికారులతో కూడిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) బృందం అడియాలా జైలును సందర్శించింది.
ప్రభుత్వ అధికారులను తిరుగుబాటుకు ప్రేరేపించినందుకు ఖాన్‌పై ఎఫ్‌ఐఏ కేసు నమోదు చేసిందని ‘డాన్’ వార్తాపత్రిక తెలిపింది. అయితే తన న్యాయవాదులు లేకుండా తాను విచారణకు సహకరించనని ఖాన్ వారికి తెలిపారు. దీంతో ఎఫ్‌ఐఏ సిబ్బంది వెనుదిరిగారు. గత ఏడాది నుంచి అడియాలా జైలులో ఉన్న ఖాన్ తరచూ 'ఎక్స్'వేదికగా సైన్యాన్ని విమర్శిస్తూ వస్తున్నారు.
ఇది కూడా చదవండి: మూడంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి
Comments
Please login to add a commentAdd a comment