
మరో ఏడుగురు ఉగ్రవాదులకు ఉరి
మరో ఏడుగురి ఉగ్రవాదులకు పాకిస్థాన్ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది.
ఇస్లామాబాద్: మరో ఏడుగురి ఉగ్రవాదులకు పాకిస్థాన్ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది. పలు హత్య కేసుల్లో బెహ్రమ్ ఖాన్, షాహిద్ హనీఫ్, మహ్మద్ తల్హా, ఖలీల్ అహ్మద్, జుల్ఫికర్ అలీ, ముస్తాక్ అహ్మద్, నవాజిష్ అలీలు నిందితులుగా ఉన్నారు. దీనిలో భాగంగా మంగళవారం వారికి వివిధ ప్రధాన నగరాల్లో ఉరిశిక్షను అమలు చేశారు.
దీంతో గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ పాకిస్థాన్ లో ఉరిశిక్ష పడ్డ వారి సంఖ్య 17 కు చేరింది. 2003లో ఓ న్యాయవాదిని సింధ్ హైకోర్టులో హత్య చేసిన ఘటనలో బెహ్రామ్ నిందితుడిగా ఉండగా, మహ్మద్ తల్హా, ఖలీల్ అహ్మద్ లు రక్షణ శాఖలో పనిచేసిన ఓ సీనియర్ అధికారి హత్య కేసులో నిందితులు.