ఇస్లామాబాద్ః పాకిస్తాన్ లో మళ్ళీ ఉగ్రదాడులు బీభత్సం సృష్టించాయి. పాక్ భద్రతా దళాలు, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మరణించగా.. ఇంటెలిజెన్స్ ఆపరేషన్ లో ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు పాకిస్తాన్ సైనికాధికారులు వెల్లడించారు.
పాకిస్తాన్ లోని చిలాస్ సమీప ఘయ్యాల్ గ్రామానికి దగ్గరలోని తారెల్ లోయలో ఉగ్రదాడులు భయోత్పాతాన్ని సృష్టించాయి. సైనిక శిబిరంపై దాడి చేసిన తీవ్ వాదులు... భద్రతా బలగాల్లోని ఇద్దరు సైనికులను కాల్చి చంపినట్లు సైనికాధికారులు వెల్లడించారు. అనంతరం ఇంటెలిజెన్స్ఆధారిత ఆపరేషన్ లో ముగ్గురు తీవ్రవాదులను విజయవంతంగా మట్టుబెట్టినట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ తాజా ఘటనతో ఘయాల్ గ్రామాన్ని భద్రతాదళాలు చుట్టు ముట్టాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే మరణించిన తీవ్రవాదులు స్థానిక పౌర రవాణా, పర్యాటకులు, భద్రతా దళాలే ధ్యేయంగా దాడులు నిర్వహించినట్లు భద్రతాధికారులు చెప్తున్నారు. ఉగ్రవాదుల వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ పాకిస్తాన్ నిషేధించిన లష్కర్-ఇ-ఝాంఘ్వి, తెహ్రీక్-తాలిబాన్-పాకిస్తాన్ బృందాలకు చెందిన తీవ్రవాదులుగా భావిస్తున్నారు.
ఉగ్ర దాడుల్లో ఇద్దరు సైనికులు హతం
Published Thu, Mar 17 2016 8:00 PM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM
Advertisement