8 మంది పాకిస్తాన్ సైనికులు మృతి | 8 soldiers, 21 militants killed in Pakistan | Sakshi
Sakshi News home page

8 మంది పాకిస్తాన్ సైనికులు మృతి

Published Thu, Oct 30 2014 2:29 PM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM

8 soldiers, 21 militants killed in Pakistan

ఖైబర్:పాకిస్తాన్ లో సైన్యానికి మిలిటెంట్లకు జరిగిన కాల్పుల్లో భారీ ప్రాణం నష్టం సంభవించింది. తాలిబన్ల వేరివేతలో భాగంగా పాకిస్తాన్  జరిపిన దాడుల్లో ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 21 మంది తాలిబన్లు మృతిచెందగా, భారీ సంఖ్యలో గాయపడ్డారు. బుధవారం ఖైబర్ జిల్లాలోని స్పిన్ కామర్ ప్రాంతంలో పాకిస్తాన్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్ లో తాలిబన్లతో తీవ్రంగా పోరాడారు. ఈ క్రమంలో ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులు అసువులు బాసారు. ఈ నెల మొదట్లో ఖైబర్-ఐ పేరుతో ఈ ఆపరేషన్ ను ఆరంభించారు.

 

 గత ఆరునెలల్లో నిర్వహించిన ఆపరేషన్ లో 1,000 మంది ఉగ్రవాదులను అంతమొందించగా, ఈ తాజా ఆపరేషన్ లో 44 మందిని మట్టుబెట్టినట్లు పాక్ ఆర్మీ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement