శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. దక్షిణ కశ్మీర్‌లోని షోపైన్ జిల్లాలో మెల్‌హురా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో భద్రతా దళాలు, పోలీసులు కార్డన్ చెర్చ్ చేపట్టారు. సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. వీరిని అల్‌ఖైదా సంబంధిత సంస్థ ఘజవత్ అల్ హింద్ అధినేత మజీద్‌తోపాటు మరో ఇద్దరిని అనంత్‌నాగ్‌కు చెందిన నజీర్‌భట్, కుల్గాంకు చెందిన ఉమర్ ఫిదాయిన్‌గా గుర్తించారు. వారి దగ్గర నుంచి ఏకే 47 రైఫిల్స్, రివాల్వర్‌తో పాటు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఈ ఆపరేషన్ మంగళవారం ఉదయం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఇందులో ఆరుగురు సైనికులతోపాటు ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి. (జమ్మూ కశ్మీర్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి)
Comments
Please login to add a commentAdd a comment