న్యూఢిల్లీ: ఇరాక్‌లోని మోసుల్ నగరంలో మిలిటెంట్ల చెరలో బందీగా ఉన్న 41 మంది భారతీయులను విడిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. సోమవారం ఆమె రాజ్యసభలో సావధాన తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. మిలిటెంట్లవద్ద బందీగా ఉన్న భారతీయులు క్షేమంగానే ఉన్నట్టు తమకు సమాచారం అందిందని చెప్పారు. బిడ్డలకోసం ఎదురుచూసే తల్లిలా తాను వారి విడుదలకోసం వేచిచూస్తున్నానని సుష్మా అన్నారు.