జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. అనంతనాగ్ జిల్లాలోని సంగం ప్రాంతంలోని హత్ముల్లా వద్ద సీఆర్‌పీఎఫ్ పికెట్‌పై ఉగ్రవాదులు సోమవారం దాడి చేశారు.
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. అనంతనాగ్ జిల్లాలోని సంగం ప్రాంతంలోని హత్ముల్లా వద్ద సీఆర్‌పీఎఫ్ పికెట్‌పై ఉగ్రవాదులు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ ఓంకార్ సింగ్, కానిస్టేబుల్ తిలక్‌రాజ్ మృతిచెందారు.
దాడి అనంతరం జవాన్ల ఆయుధాలను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు.