- ఇద్దరు మిలిటెంట్లు, ఇద్దరు జవాన్లు మృతి
జమ్మూ: ఉత్తర కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మిలిటెంట్లతోపాటు ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతిచెందారు. కుప్వారా జిలా లారిబల్ గ్రామంలో గురువారం రాత్రినుంచే ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయని, అవి ఇంకా కొనసాగుతున్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ కాల్పుల సందర్భంగా ఇద్దరు గుర్తుతెలియని మిలిటెంట్లు హతమయ్యారని, ఇద్దరు జవాన్లు కూడా మృతిచెందారని అధికారులు తెలిపారు.
మరోసారి పాక్ కాల్పులు
భారత్, పాకిస్తాన్ సైన్యాధికారులమధ్య ఓ వైపు చర్చల ప్రక్రియ నడుస్తుండగానే పాక్ దళాలు కశ్మీర్ సరిహద్దుల్లో మరోసారి కాల్పులకు పాల్పడ్డాయి. రాజౌరీ జిల్లాలోని హమీర్‌పూర్ సెక్టార్‌లో అధీనరేఖవెంట పాక్ దళాలు శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపాయని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్
Published Sat, Sep 12 2015 4:06 AM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
Advertisement
Advertisement