North Kashmir
-
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అయిదుగురు విదేశీఉగ్రవాదులను జవాన్లు హతమార్చారు. ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న సైన్యం, పోలీసులు గురువారం రాత్రి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఈక్రమంలోనే పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగిందని కాశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు మరణించారని.. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. #KupwaraEncounterUpdate: Five (05) foreign #terrorists killed in #encounter. Search in the area is going on: ADGP Kashmir@JmuKmrPolice https://t.co/h6aOuTuSj0 — Kashmir Zone Police (@KashmirPolice) June 16, 2023 -
కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లో శాటిలైట్ ఫోన్లు
శ్రీనగర్: అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలు వదిలేసి వెళ్లిన అత్యాధునిక సామగ్రి కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడుల్లో ఇరిడియమ్ శాటిలైట్ ఫోన్లు, థర్మల్ ఇమేజరీ సామగ్రి దొరకడంతో ఈ మేరకు అనుమానాలు నిజమయ్యాయి. ఉత్తరకశ్మీర్ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 15వరకు శాటిలైట్ ఫోన్ సంకేతాల జాడలు కనిపించగా, తాజాగా దక్షిణ కశ్మీర్‌లోనూ గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఇవి ఉన్నట్లు తేలిందని అంటున్నారు. అదేవిధంగా, రాత్రి సమయాల్లో భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు ఉపయోగపడే వైఫై ఆధారిత థర్మల్ ఇమేజరీ సామగ్రి ఉగ్రస్థావరాల్లో లభ్యమైంది. శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా సమీపంలో ఉన్న భద్రతా సిబ్బంది ఉనికిని ఈ పరికరం గుర్తించి హెచ్చరికలు చేస్తుంది. ఉగ్రవాది దాక్కున్న ప్రాంతం వెలుపలి ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ పరికరాలు అఫ్గానిస్తాన్‌లో దశాబ్దాలపాటు తిష్టవేసిన అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు వాడినవేనని తెలిపారు. అనంతరం వీటిని తాలిబన్లు, ఇతర ఉగ్రసంస్థలు చేజిక్కించుకుని, కశ్మీర్ ఉగ్రవాదులకు అందజేసి ఉంటారని అధికారులు అంటున్నారు. అయితే, వీటిని గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. శాటిలైట్ ఫోన్ జాడలను నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్టీఆర్వో), డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ)లు ఎప్పటికప్పుడు కనిపెట్టే పనిలోనే ఉన్నాయన్నారు. అదేవిధంగా, థర్మల్ ఇమేజరీ పరికరాలను పనిచేయకుండా ఆపేందుకు భద్రతా బలగాలు జామర్లను ఉపయోగిస్తున్నాయని అన్నారు. వీటిని వినియోగించే వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. దేశంలో శాటిలైట్ ఫోన్ల వినియోగంపై కేంద్రం 2012లో పూర్తి నిషేధం విధించింది. -
‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’.. వధువు వరస మారుతోంది!
పెళ్లికూతుళ్లు సంప్రదాయాలను తిరగ రాస్తున్నారు. పెళ్లిపీటల మీద తల దించుకుని ఉండటం.. కాబోయే భర్త ఎదుట సిగ్గుల మొగ్గ కావడం.. అత్తారింటికి వెళ్లేప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడ్వడం.. ఈ ‘సంప్రదాయ ధోరణి’ కాదని పెళ్లి రోజున పూర్తి ఉత్సాహంగా ఉంటున్నారు. జీవితంలో ముఖ్యమైన రోజును అణువణువు ఆనందమయం చేసుకోజూస్తున్నారు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అని పాడుతూ డాన్స్ చేస్తున్నారు. అంతేనా? అత్తారింటికి పక్కన భర్తను కూచోబెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు. నిజంగా వీరు కొత్త పెళ్లికూతుళ్లే. నాలుగు రోజుల క్రితం, ఆగస్టు 22న ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఒక పెళ్లి జరిగింది. వధువు సనా షబ్నమ్, వరుడు షేక్ ఆమిర్. ఇప్పుడు వధువు అత్తారింటికి వెళ్లాలి. సాధారణంగా ఆ సమయంలో పెళ్లిమంటపం గంభీరంగా ఉంటుంది. పెళ్లికూతురి తల్లిదండ్రులు భావోద్వేగాలకు లోనవుతారు. ఇన్నాళ్లు పెంచి పోషించిన బంగారు తల్లి ఇప్పుడు తమ నుంచి వేరుపడి కొత్త జీవితంలోకి అడుగు పెడుతోంది కనుక ఆమె వైవాహిక జీవితం బాగుండాలని ఒక ఆకాంక్ష, ఆమె అక్కడ ఎలా ఉండ బోతోందోననే ఆందోళన... ఇవన్నీ వాతావరణాన్ని బరువెక్కిస్తాయి. పెళ్లికూతురు బొరోమని తన వాళ్లను పట్టుకుని ఏడుస్తుంది. పెళ్లికొడుకు సర్ది చెప్పి బండి ఎక్కిస్తాడు... సాధారణంగా జరిగే ఈ రివాజు మొత్తం ఆ రోజు ఆ పెళ్లిలో ఏమీ జరగలేదు. పెళ్లి ఇంటి దగ్గర బయట ఉన్న మహీంద్రా ఎస్.యు.వి వరకూ పెళ్లి కూతురు హుషారుగా నడిచి వచ్చింది. డ్రైవింగ్ సీట్లో కూచుంది. భర్త ఆమిర్‌ను పాసింజర్ సీట్లో కూచోబెట్టుకుంది. ‘వెళదామా... అత్తారింటికి’ అని బండి స్టార్ట్ చేసింది. బంధుమిత్రులందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే పెళ్లికూతురి ఉత్సాహాన్ని ప్రోత్సహించారు. కశ్మీర్ లోయలో ఇలాంటి ‘విదాయి’ (అంపకాలు) ఎవరూ చూడలేదు. కాని పెళ్లికూతురు సనా షబ్నమ్ గతంలోని స్టీరియోటైప్‌ను బ్రేక్ చేసింది. ‘నేను కశ్మీర్ పెళ్లిళ్ల మూస పద్ధతిని మార్చాలనుకున్నాను. సనా నన్ను కూచోబెట్టుకుని డ్రైవ్ చేయడం తన జీవితంలోని ముఖ్యరోజున విశేషం అవుతుందని భావించాను. ఆమె నన్ను కూచోబెట్టుకుని నడపడాన్ని ప్రోత్సహించాను. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చుగాని చాలామంది మెచ్చుకున్నారు’ అని సనా భర్త ఆమిర్ అన్నాడు. అతడు వృత్తిరీత్యా అడ్వకేట్. బారాముల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా. కశ్మీర్ ముస్లింలలో సంప్రదాయాల పట్ల కట్టుబాటు ఉన్నా అక్కడ స్త్రీలు ఆధునికంగా ఆలోచించడాన్ని ఆహ్వానిస్తున్నారని ఈ ఉదంతం వెల్లడి చేస్తోంది. అయితే నెల క్రితం కలకత్తాలో జరిగిన ఇలాంటి సంఘటనే ‘జండర్ మూస’ను బద్దలు కొట్టినట్టయ్యింది. సాధారణంగా భార్య జీవితానికి మార్గం చూపేవాడు భర్తే అవుతాడు సగటు పురుషస్వామ్య భావజాలంలో. భర్త ప్రతిదాన్ని లీడ్ చేస్తే భార్య అనుసరించాలి. ఇది పెళ్లయిన నాటి నుంచి సమాజం మొదలెడుతుంది. అంపకాల్లో పెళ్లికూతురి తండ్రి తన కుమార్తె చేతిని అల్లుడి చేతిలో పెట్టి ‘జాగ్రత్త నాయనా... ఎలా చూసుకుంటావో’నని ఎమోషనల్ అవుతాడు. సమాజం ఇంత ముందుకు వెళ్లినా స్త్రీలు తమ సామర్థ్యాలను నిరూపిస్తున్నా భార్యను భర్త మీద ఆధారపడే వ్యక్తిగా సంకేతం ఇచ్చే ‘అంపకాలను’ ఎందుకు తిరస్కరించకూడదు అని కోల్‌కతాకు చెందిన వధువు స్నేహా సింగ్ అనుకుంది. పెళ్లి అయ్యాక భారీ పెళ్లి లహెంగాలో భర్త సౌగత్ ఉపాధ్యాయను బండిలో కూచోబెట్టుకుని అత్తారింటికి బయలుదేరింది. ఇది దేశంలో చాలా వైరల్ వీడియో అయ్యింది. ‘ఇలా చేయాలని నెల క్రితమే నేను అనుకుని సౌగత్‌ను అడిగాను. అతడు సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆ తర్వాత ఆ సంగతి పెళ్లి కంగారులో మర్చిపోయి నేను పాసింజర్ సీట్లో కూచుంటే నువ్వు నడుపుతానన్నావుగా అని అతడే గుర్తు చేశాడు. నిజానికి సౌగత్‌ను కూచోబెట్టుకుని బండిలో తిప్పడం పెళ్లికి ముందు నుంచే నాకు అలవాటు. ఆ పనే ఇప్పుడూ చేశాను. అతని డ్రైవింగ్ నాకు భయం కూడా అనుకోండి’ అని నవ్వింది స్నేహా. ఇరవై ముప్పై ఏళ్ల క్రితం కమ్యూనికేషన్ వ్యవస్థ, ట్రాన్స్‌పోర్టేషన్ సరిగా ఉండేవి కాదు. అత్తారిల్లు పక్క ఊళ్లోనే అయినా దూరం అయినా రాకపోకలు మాటా మంతి అంతగా సాగేవి కావు. ఉత్తరాలనే నమ్ముకోవాల్సి వచ్చేది. పైగా ఆనాటి ఆడపిల్లలు సరైన చదువుకు, ఉపాధికి నోచుకోక భవిష్యత్తంతా అత్తారింటి మంచి చెడ్డల మీద ఆధారపడి ఉండేవారు. అందువల్ల పెళ్లి సమయాలలో పెళ్లికూతుళ్లు ఆందోళనగా, ఉద్వేగంగా, సమాజ పోబడికి తగ్గట్టు బిడియంగా ఉండేవారు. కాని ఇప్పుడు ఎంత దూరం వెళ్లినా, అమెరికాలో ఉన్నా అనుక్షణం తన వాళ్లకు కనపడుతూ వినపడుతూ ఉండే వీలు ఉంది. ఒక్కరోజు తేడాలో ఎంత దూరం అయినా ప్రయాణించవచ్చు. అబ్బాయి అమ్మాయిల మధ్య పెళ్లికి ముందు కొద్దో గొప్పో మాటలు నడిచి పెళ్లి నాటికి స్నేహం కూడా ఏర్పడుతోంది. అందుకే ఇప్పుడు పెళ్లిళ్లలో పూర్తిగా కొత్త ఆలోచనల పెళ్లికూతుళ్లు కనిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన వధువు సాయి శ్రీయ వరుడు అశోక్‌తో అంపకాల సమయంలో అత్తారింటికి సంతోషంగా వెళుతూ ప్రైవేటు గీతం ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ పాటకు చేసిన నృత్యం దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో సాయి శ్రీయ తన భర్తను చూస్తూ సంతోషంగా డాన్స్ చేస్తుంటే భర్త కూడా ఎంతో ముచ్చట పడుతూ చూడటాన్ని జనం మెచ్చుకున్నారు. ఆ జంటను ఆశీర్వదించారు. నిన్న మొన్నటి వరకు అబ్బాయికి విందులో ఏది ఇష్టం, మంటపం ఏది బుక్ చేయమంటాడు, పెళ్లి ఎలా జరగాలంటాడు వంటి ప్రిఫరెన్సు దక్కేది. ఇప్పుడు అమ్మాయికి ఏది ఇష్టం, ఏం కావాలంటోంది, ఏది ముచ్చపడుతోంది అని అడిగి అంగీకరించే పరిస్థితికి నేటి ఆడపిల్లలు వీలు కల్పిస్తున్నారు. సంతోషాల ఎంపికలో ఆమెకూ సమాన భాగం దొరికితే ఆ వివాహం మరెంతో సుందరం కదా. -
మాటల కశ్మీరం.. సమానియా
సరిహద్దు సమస్యలు, అంతర్గత అల్లరు,్ల మరోపక్క ఉగ్రమూకల దాడులతో అట్టుడికే కశ్మీర్... ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత మిగతా రాష్ట్రాల్లాగే పరిస్థితులు క్రమంగా మారుతుండడంతో..అక్కడి యువత సరికొత్త ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇటువంటి అవకాశాన్ని తన తెలివితేటలు, నైపుణ్యంతో అందుకున్న ఆర్జే సమానియా.. ఉత్తర కశ్మీర్లో తొలి మహిళా ఆర్జేగా నిలిచింది. 19 ఏళ్ల సమానియా బారముల్ల ఓల్డ్ టౌన్‌కు చెందిన అమ్మాయి. సమానియా భట్ రోజూ తండ్రి పక్కన కూర్చుని ప్రపంచవ్యాప్తంగా జరిగే విషయాలను ఆయనతో చర్చిస్తూ అప్డేటెడ్గా ఉండేది. ఉదయాన్నే వచ్చే వార్తాపత్రికలను చదువుతూ, టీవీల్లో వచ్చే వార్తలను శ్రద్ధగా వినడం ఆమెకు ఒక అలవాటుగా ఉండేది. ఆ అలవాటే నేడు సమానియాను ఉత్తర కశ్మీర్లో తొలి రేడీయో జాకీగా మార్చింది. తన సుమధుర వాక్ చాతుర్యంతో శ్రోతల్ని ఆకట్టుకొంటూ నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. మాస్ కమ్యూనికేషన్ అండ్ వీడియో ప్రొడక్షన్లో డిగ్రీ చదివింది. జర్నలిస్టు కావాలన్న కలతో డిగ్రీలో మాస్ కమ్యునికేషన్ పాఠాలు చాలా శ్రద్ధగా నేర్చుకునేది. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే స్థానిక న్యూస్ పేపర్ లలో కూడా పనిచేసేది. ఆ ఆసక్తితోనే డిగ్రీ పూర్తయ్యాక జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో పీజీ ఎంట్రన్స్ కోసం సన్నద్ధమవుతూ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసింది. స్కాలర్షిప్ మంజూరు అయినప్పటికీ, కరోనా సెకండ్ వేవ్ వల్ల చేతికి రాకుండానే స్కాలర్షిప్ వెనక్కి వెళ్లింది. ఇది సమానియాకు కాస్త బాధ కలిగించినప్పటికీ నిరుత్సాహ పడకుండా ముందుకు సాగింది. ఆర్జేగా... స్కాలర్షిప్ రాలేదన్న బాధలో ఉన్న సమానియాకు మజ్‌బగ్‌లో ఉన్న కశ్మీర్ రేడియో ఛినార్–ఎఫ్ఎమ్:90.4 రేడియో జాకీలకోసం దరఖాస్తుల ఆహ్వాన ప్రకటన కనిపించింది. అది చూసి వెంటనే రేడియో జాకీ (ఆర్జే) పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఈ పోస్టుకోసం కశ్మీర్‌లోని వివిధ జిల్లాల నుంచి 250 మంది పోటీపడ్డారు. పోటీ ఎక్కువగా ఉండడంతో నాలుగైదు రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత సమానియా ఆర్జేగా సెలెక్ట్ అయ్యింది. కాగా రేడియో స్టేషన్ నలుగుర్ని మాత్రమే ఎంపిక చేయగా.. సమానియా మాత్రమే మహిళా ఆర్జేగా సెలెక్ట్ అయ్యింది. ఆకట్టుకునే వాక్చాతుర్యంతో శ్రోతలలో పాజిటివ్ ఎనర్జీని నింపుతూ తనవైపు తిప్పుకుంటుంది. ‘హల్లా బోల్ విత్ ఆర్జే సమానియా’ షో చేస్తూ శోతల అభిమానం చూరగొనడం, ఈ షోకు మంచి స్పందన లభించడంతో తొలుత మ«ధ్యాహ్నం 12గంటల నుంచి 3 గంటల వరకు ఉన్న షో సమయాన్ని, మ«ధ్యాహ్నం 3 గంటల నుంచి ఆరుగంటల వరకు ప్రసారం చేస్తున్నారు. ప్రేర ణాత్మక మాటలు చెప్పడమేగాక ఆయా రంగాల్లో ఉన్నతస్థాయికి ఎదిగిన యువతీ యువకులను అతిథులుగా పిలిచి క్రియేటివ్‌గా ఇంటర్వ్యూలు కూడా చేస్తోంది. ఆత్మీయ స్వరం, సానుకూల మాటలతో సమానియా రేడియో జాకీగా దూసుకుపోతోంది. ‘‘నేను ఆర్జే అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ప్రింట్ మీడియాలో పనిచేస్తున్నప్పుడు టీచర్లు, స్నేహితులు ‘నువ్వు రేడియో జర్నలిజానికి బాగా పనికొస్తావు’ అని ప్రోత్సహించేవారు. అయితే నేను ఎప్పుడు ఆ దిశగా ప్రయత్నించలేదు. కానీ రేడియో స్టేషన్ చినార్ ప్రకటన నాలో ఆశలు రేపింది. అందరితో పోటీపడి ఆర్జేగా సెలెక్ట్ అయ్యాను. నైపుణ్యం కలిగిన కశ్మీర్ యువతను మేల్కొల్పడమే మా ముఖ్య ఉద్దేశ్యం. యువతలోని శక్తిసామర్థ్యాలను తట్టిలేపి, వారిలోని ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చూపించడమే’’ అని సమానియా చెప్పింది. -
జమ్మూకశ్మీర్‌లో ఎన్ఐఏ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రనిధుల కేసులో భాగంగా జమ్మూకశ్మీర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో ఏకకాలంలో నాలుగు చోట్లు ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అక్కడి ఇళ్లను జల్లెడపడుతున్నారు. వేర్పాటువాద నేత మసరత్ ఆలంను గతవారం జమ్మూకశ్మీర్ జైలు నుంచి ఢిల్లీ నుంచి తరలించిన ఎన్ఐఏ.. విచారణలో అతడని నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఆ డేటా ఆధారంగానే ఇప్పుడు సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. టెర్రర్ ఫండింగ్ కేసు 2012లో ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మసరత్ ఆలంతోపాటు వేర్పాటువాద నేతలు అసియా ఆంద్రబి, షబీర్ షా సహా 12మందిపై అభియోగాలు నమోదుచేసింది. -
వారిని శిక్షించకుండా వదలం: ప్రధాని మోదీ
-
వారిని శిక్షించకుండా వదలం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో యూరీ సెక్టార్ లోని ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ దాడి వెనుకున్న కుట్రదారులను చట్టముందు నిలబెడతామని జాతికి ఆయన హామీయిచ్చారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించకుండా వదలబోమన్నారు. దాడి గురించి తెలిసిన వెంటనే హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్టు తెలిపారు. కశ్మీర్ వెళ్లమని పరీకర్ ను ఆదేశించినట్టు వెల్లడించారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్లకు ప్రధాని నివాళి అర్పించారు. వారి త్యాగాన్ని సదా స్మరించుకుంటామని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తర కశ్మీర్ లోని యూరీ పట్టణంలో ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17 మంది సైనికులు వీరమరణం పొందారు. 19 మంది గాయపడ్డారు. దాడికి పాల్పడిన నలుగురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. -
ఇద్దరిలో ఒకడు దొరికాడు
హంద్వారా: జమ్మూకశ్మీర్ లోని హంద్వారా పట్టణంలో 16 ఏళ్ల బాలికపై వేధింపులకు తెగబడిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. నిందితుడిని హిలాల్ అహ్మద్ బాండేగా గుర్తించారు. అతడిని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ నెల 12న పాఠశాల నుంచి తన స్నేహితురాలితో కలిసి ఇంటికి తిరిగొస్తుండగా ఇద్దరు దుండగులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని బాధిత బాలిక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కు తెలిపింది. తన బ్యాగు కూడా లాక్కుపోయారని వెల్లడించింది. తనపట్ల సైనికులు అనుచితంగా ప్రవర్తించారని వచ్చిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. కాగా, బాలికను సైనికులు వేధించారన్న వందతులు వ్యాపించడంతో స్థానికులు భద్రతా దళాలపై రాళ్లతో దాడి చేశారు. ఆర్మీ బంకర్ ను ధ్వంసం చేశారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా స్పందించి చర్యలు చేపట్టాయి. -
కశ్మీర్లో ఎన్కౌంటర్
- ఇద్దరు మిలిటెంట్లు, ఇద్దరు జవాన్లు మృతి జమ్మూ: ఉత్తర కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లతోపాటు ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతిచెందారు. కుప్వారా జిలా లారిబల్ గ్రామంలో గురువారం రాత్రినుంచే ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయని, అవి ఇంకా కొనసాగుతున్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ కాల్పుల సందర్భంగా ఇద్దరు గుర్తుతెలియని మిలిటెంట్లు హతమయ్యారని, ఇద్దరు జవాన్లు కూడా మృతిచెందారని అధికారులు తెలిపారు. మరోసారి పాక్ కాల్పులు భారత్, పాకిస్తాన్ సైన్యాధికారులమధ్య ఓ వైపు చర్చల ప్రక్రియ నడుస్తుండగానే పాక్ దళాలు కశ్మీర్ సరిహద్దుల్లో మరోసారి కాల్పులకు పాల్పడ్డాయి. రాజౌరీ జిల్లాలోని హమీర్పూర్ సెక్టార్లో అధీనరేఖవెంట పాక్ దళాలు శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపాయని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.