బీఎస్‌ఎఫ్ వాహనంపై ఉగ్రవాదుల దాడి | Two BSF troopers killed, four hurt in Kashmir guerrilla attack | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎఫ్ వాహనంపై ఉగ్రవాదుల దాడి

Published Sat, Aug 16 2014 4:25 PM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM

Two BSF troopers killed, four hurt in Kashmir guerrilla attack

శ్రీనగర్:జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఓ బీఎస్ఎస్ వాహనంపై ఉగ్రవాదులు శనివారం దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో నలుగురికి గాయాలైయ్యాయి. దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో కోలి గ్రామంలో ఓ వాహనంలో వెళుతున్న జవాన్లపై ఉగ్రవాదులు ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారు. ఇందులో ఒక ఎస్ఐతో సహా కానిస్టేబుల్ మృతి చెందాడు.

 

ఈ ఘటనలో గాయపడిన నలుగురు జవాన్లను ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పారా మిలటరీ బలగాలు, పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని మిలటెంట్ల కోసం వెతుకులాట ఆరంభించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement