BSF javans
-
సహచరులను కాల్చేసిన బీఎస్ఎఫ్ జవాను
అమృతసర్: బీఎస్ఎఫ్ జవాను ఒకరు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో తోటి జవాన్లు నలుగురు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం సదరు జవాను కూడా మృతి చెందాడు. పంజాబ్‌లో ఖాసా ఏరియాలోని 144వ బెటాలియన్ క్యాంపులో ఆదివారం ఈ ఘోరం జరిగింది. కర్ణాటకకు చెందిన సత్తెప్ప అనే జవాను తనకు బాగాలేదని చెప్పడంతో శనివారం రాత్రి ఆస్పత్రిలో చేర్చినట్టు బీఎస్ఎఫ్ పంజాబ్ ఐజీ ఆసిఫ్ జలాల్ చెప్పారు. ఆదివారం ఉదయమే అతను డిశ్చార్జై క్యాంపులోకి వచ్చాడని, ఆయుధాగారం నుంచి తుపాకీ తీసుకొనికాల్పులకు దిగాడని చెప్పారు. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ర్యాంకు జవాన్లు నలుగురు చనిపోయారన్నారు. మరో జవాను పరిస్థితి విషమంగా ఉందనిత చెప్పారు. తర్వాత సత్తెప్ప కూడా చనిపోయి కన్పించాడు. ఎలా చనిపోయాడన్నది తెలియాల్సి ఉంది. మృతులను రామ్ వినోద్ (బిహార్), తొరాస్కర్ (మహారాష్ట్ర), రతన్ సింగ్ (జమ్మూకశ్మీర్), బల్జీందర్ కుమార్ (హరియాణా)గా గుర్తించారు. -
ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేను: అక్షయ్ కుమార్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురువారం భారత జవాన్లతో గడిపారు. ఈ సందర్భంగా వారితో గడిపిన క్షణాలను ఫోటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. దేశాన్ని కాపాడే జవాన్లంటే ఈ ఖిలాడీ హీరోకు ప్రత్యేకమైన అభిమానం అని ఎన్నో సార్లు చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన తన చేతల ద్వారా నిరూపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. జవాన్లతో ఓ రోజు గడిపిన కేసరి అక్షయ్ గురువారం నాడు ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసి) కు కాపలాగా ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లను కలిశారు. కార్గో ప్యాంటు, లేత గోధుమరంగు టీ షర్టుతో తాను ఓ జవానులా మారి వారిలో ఒకరిలా కలిసిపోయారు. అక్కడి జవాన్లతో కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడ సంప్రదాయంగా జరిగే కార్యక్రమాలకు డీజీ బీఎస్ఎఫ్ ఎస్‌హెచ్. రాకేశ్ అస్థానాతో కలిసి హాజరయ్యారు. అనంతరం అక్షయ్ నటించిన గుడ్ న్యూవ్జ్ చిత్రం నుంచి సౌదా ఖారా ఖారా పాటకు కాసేపు స్టెప్పులు వేసి అందరినీ అలరించాడు. ఈ సందర్భంగా మన కేసరి జవాన్లతో గడిపిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాటికి క్యాప్షన్‌గా.. "ఈ రోజు సరిహద్దులను కాపలాగా ఉన్న ధైర్యవంతులతో ఒక రోజు గడపడం మరచిపోలేను. ఇక్కడకు రావడం నాకు ఎప్పుడూ మాటలతో వర్ణించలేని అనుభుతిని కలిగిస్తుంది. ఈ రోజు నిజమైన హీరోలను కలవడం నాకేంతో సంతోషంగా ఉందంటూ’ అందులో తెలిపారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Zoom TV (@zoomtv) చదవండి: Akshay Kumar: పక్కా ప్లాన్.. రూ.1000 కోట్లు టార్గెట్! -
కరోనా కర్కశత్వం
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కల్లోలం ఆగడం లేదు. మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగుతోంది. దేశంలో కరోనా కేసులు 50 వేల మార్కును దాటేశాయి. బుధవారం నుంచి గురువారం వరకు ఒక్కరోజులో 89 మంది కోవిడ్‌తో మరణించారు. కొత్తగా 3561 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంమరణాల సంఖ్య 1,783కు, కేసుల సంఖ్య 52,952కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. యాక్టివ్ కరోనా కేసులు 35,902. ఇప్పటివరకు 15,266 మంది కోవిడ్ బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 28.83 శాతానికి పెరిగిందని ఆరోగ్యశాఖ అధికార వర్గాలు తెలిపాయి. పాజిటివ్ కేసులు రెట్టింపు కావడానికి ప్రస్తుతం 11 రోజులు పడుతోంది. కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్లో అత్యధికంగా నమోదవుతున్నాయి. 13 రాష్ట్రాలు, యూటీల్లో జీరో దేశంలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ చెప్పారు. కేరళ, ఒడిశా, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మిజోరం, మణిపూర్, గోవా, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ కేసులు రాలేదన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచుతున్నామని చెప్పారు. ఇప్పటిదాకా 13,57,442 పరీక్షలు నిర్వహించామన్నారు. సరిహద్దు భద్రతా దళానికి(బీఎస్ఎఫ్) చెందిన ఇద్దరు జవాన్లు కోవిడ్ కారణంగా మరణించారని, ఈ దళంలో కొత్తగా 41 మందికి కరోనా వైరస్ సోకిందని అధికారులు గురువారం చెప్పారు. కరోనా వైరస్ బాధితులకు గంగా నదీ జలంతో చికిత్స అందించడంపై అధ్యయనం (క్లినికల్ స్టడీస్) చేయాలన్న కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదనపై ముందుకెళ్లకూడదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గురువారం నిర్ణయించింది. దీనిపై శాస్త్రీయమైన సమాచారం అవసరమని స్పష్టంచేసింది. -
బీఎస్ఎఫ్ వాహనం పై మావోయిస్టుల మెరుపు దాడి
రాయపూర్: బీజాపుర్‌లో మావోయిస్టులు మళ్లీ పంజా విసిరారు. బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోలు మందుపాతర (ఐఈడీ)తో పేల్చివేశారు. ఈ దాడిలో ఐదుగు బీఎస్ఎఫ్ జవాన్లుకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటపలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు వాహన డ్రైవర్‌కి తీవ్ర గాయాలైయ్యాయి. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. -
సహచరులను చంపి.. జవాన్ ఆత్మహత్య
అగర్తాల: త్రిపురలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ దారుణానికి పాల్పడ్డారు. అక్కడే పనిచేస్తున్న ముగ్గురు సహోద్యోగులపై తన సర్వీస్ తుపాకీతో కాల్పులు జరిపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన త్రిపురలోని ఉనాకోటి జిల్లా పరిధిలోని మగురూలి సరిహద్దుల్లో జరిగింది. శిశుపాల్ అనే జవాన్..తన సహోద్యోగి అయిన హెడ్‌కానిస్టేబుల్ బిజోయ్ కుమార్‌పై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. దీంతో బిజోయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అక్కడే ఉన్న మరో ఇద్దరు జవాన్లు రింకూ కుమార్, రాకేశ్ కుమార్ జాదవ్‌లపై కాల్పులు జరిపి, అదే తుపాకీతో తనని తాను కాల్చుకొని చనిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరి జవాన్లను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనిపై స్థానిక ఎస్పీ శంకర్ దేవ్నాథ్ మాట్లాడుతూ.. ‘బీఎస్ఎఫ్ జవాను.. హెడ్ కానిస్టేబుల్‌తో సహా మరో ముగ్గురిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కేడ మృతి చెందారు. మిగతావారిని ఉనాకోటిలోని ఆసుపత్రికి తరలించగా అందులో చికిత్స పొందుతూమరణించారు. మృతదేహాలను స్వరాష్ట్రలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాం. ఘటనపై విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’ అని తెలిపారు. -
కొత్తగా పెళ్లి చేసుకున్న జవాన్ల కోసం..
న్యూఢిల్లీ: కొత్తగా పెళ్లి చేసుకున్న జవాన్ల కోసం దేశవ్యాప్తంగా 190 అతిథి గృహాలను నిర్మించాలని బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) నిర్ణయించింది. ‘బీఎస్ఎఫ్ విధులు చాలా కఠినంగా ఉంటాయి. జవాన్లు తమ సర్వీసులో ఎక్కువ కాలం ఒంటరిగానే ఉండాల్సి వస్తోంది. వారికి ఏడాదిలో రెండున్నర నెలలు మాత్రమే కుటుంబంతో గడిపే సమయం ఉంటుంది. మొత్తంగా 30 ఏళ్లు సర్వీసులో ఉంటే.. అందులో ఐదేళ్లు మాత్రమే కుటుంబంతో ఉంటారు. ఈ నేపథ్యంలో జవాన్లు మరింత ఎక్కువ సమయం కుటుంబంతో గడిపేందుకు సదుపాయాలు కల్పిస్తున్నాం. 186 బెటాలియన్ లొకేషన్లతోపాటు మరికొన్ని చోట్ల అపార్ట్మెంట్లు నిర్మించనున్నాం. ప్రతి బెటాలియన్ వద్ద 15 స్టూడియో అపార్ట్మెంట్లు నిర్మిస్తాం’ అని బీఎస్ఎఫ్ డైరెక్టర్ కేకే శర్మ వెల్లడించారు. ‘కొత్తగా పెళ్లి చేసుకున్న జవాన్లపై ఒంటరితనం ఎక్కువగా ప్రభావితం చూపుతుంది. అందుకే ఈ సదుపాయాలు కల్పించడంలో వారికే ప్రాధాన్యం ఇస్తాం. ఓ నిర్ణీత సమయం వరకు అందులో ఉండేందుకు వారికి అనుమతి ఇస్తాం’ అని వివరించారు. తూర్పు, పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో 2,800 పైగా గదులను నిర్మించనున్నట్లు తెలిపారు. -
‘సరిహద్దు’లో రక్షణ మంత్రి
శ్రీనగర్: కశ్మీర్లో భారత్– పాక్ నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి బీఎస్ఎఫ్ జవాన్లు పహారా కాస్తున్న భారత ఫార్వర్డ్ పోస్టులను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. ఎల్వోసీ వెంట ఉగ్రవాదుల చొరబాట్లను విజయ వంతంగా నిలువరించిన ఘటనలను సైన్యాధికారులు ఆమెకు వివరించారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న ఆమె శుక్రవారం నేరుగా కుప్వారా సెక్టార్‌లోని సరిహద్దు పోస్టులను సందర్శించారు. బదామీ బాగ్ కంటోన్మెంట్లో ఉగ్రచొరబాట్లను నిలువరించిన తీరు, ఉగ్రవ్యతిరేక చర్యలను ఆర్మీ కమాండర్ ఆమెకు వివరించారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా ఆమె కశ్మీర్ లోయ వెంట సరిహద్దు ప్రాంతాలు, లడఖ్ ప్రాంతంలో వాస్తవాధీనరేఖ వెంట భద్రత పరిస్థితులను ఆమె సమీక్షించనున్నారు. -
బీఎస్ఎఫ్ వాహనంపై ఉగ్రవాదుల దాడి
శ్రీనగర్:జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఓ బీఎస్ఎస్ వాహనంపై ఉగ్రవాదులు శనివారం దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో నలుగురికి గాయాలైయ్యాయి. దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో కోలి గ్రామంలో ఓ వాహనంలో వెళుతున్న జవాన్లపై ఉగ్రవాదులు ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారు. ఇందులో ఒక ఎస్ఐతో సహా కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడిన నలుగురు జవాన్లను ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పారా మిలటరీ బలగాలు, పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని మిలటెంట్ల కోసం వెతుకులాట ఆరంభించాయి. -
పాక్ స్మగ్లర్ల కాల్చివేత, 120 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ఒకటి కాదు.. రెండు కాదు.. 24 కిలోల హెరాయిన్. దాని విలువ రూ. 120 కోట్లు. ఇంత హెరాయిన్‌ను పాకిస్థానీ స్మగ్లర్లు భారతదేశంలోకి తరలిస్తుండగా బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించి వారిని కాల్చిచంపారు. ముల్లాపూర్ గ్రామం వద్ద పెట్రోలింగ్ చేస్తున్న బీఎస్ఎఫ్ దళాలపై వారు కాల్పులు జరపడంతో జవాన్లు తిప్పికొట్టగా ముగ్గురు స్మగ్లర్లు చనిపోయారు. తెల్లవారిన తర్వాత మృతదేహాల వద్ద గాలించగా, వారివద్ద రూ. 120 కోట్ల విలువైన 24 కేజీల హెరాయన్ దొరికింది. దీంతోపాటు కొన్ని ఆయుధాలు, మందుగుండు కూడా స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, మరిన్ని ఆయుధాలు, మరింత మొత్తంలో డ్రగ్స్ దొరికే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
బీహార్‌లో చంద్రగిరి జవాన్ మృతి
చంద్రగిరి, న్యూస్‌లైన్: చంద్రగిరికి చెందిన బీఎస్ఎఫ్ జవాను శేఖర్‌బాబు(36) గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవలే ఆయన ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్కూ ఫోర్స్)కు డెప్యుటేషన్‌పై బీహార్‌కు వెళ్లారు. గతనెల 31వ తేదీ రాత్రి 11గంటల సమయంలో చాతీలో నొప్పిగా ఉన్నట్లు సహచర జవాన్లకు తెలిపాడు. అక్కడి అధికారులు వెంటనే అంబులెన్స్‌లో పాట్నాలోని నలంద మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని 13మంది సైనికులు ఆదివారం అర్ధరాత్రి చంద్రగిరిలోని ఆయన ఇంటికి తీసుకువచ్చారు. అధికార లాంచనాలతో అంత్యక్రియలు జవాను శేఖర్‌బాబు భౌతికకాయూనికి బీఎస్ఎఫ్ అధికారులతో పాటు స్థానిక పోలీసులు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బీఎస్ఎఫ్ అధికారి రథన్సింగ్ జోరా ఆధ్వర్యంలో ఎస్ఐ స్థాయి అధికారి ఎ.ఫాతిమరాజ్తో పాటు 11మంది జవాన్లు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శేఖర్‌బాబు కుటుంబసభ్యుల కోరిక మేరకు ముఖం కనబడేటట్లుగా శవపేటికను తెరచిపెట్టారు. హిందూ సంప్రదాయం ప్రకారం సైనిక లాంచనాలతో ఖననం చేశారు. కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. ఏఆర్ పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. -
నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి
విశాఖ: జిల్లా సరిహద్దులో మావోయిస్టులు సృష్టించిన విధ్వంసంలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను మావోయిస్టులు పేల్చి వేయడంతో నలుగురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడిలో 200 మంది మావోయిస్టులకు వరకూ పాల్గొని ఉండవచ్చనదే ప్రాధమిక సమాచారం. గాయపడిన జవాన్లను సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లు ఉత్తర ప్రదేశ్, హిమచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.