ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్‌పోక్పి జిల్లాలో కేఎన్‌ఎఫ్(కూకి నేషనల్ ఫ్రంట్), ఆర్‌పీఎఫ్(రెవల్యూషనరీ పీపుల్స్ ఫ‍్రంట్) సంస్థలకు చెందిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్ట్ అయిన కేఎన్‌ఎఫ్ ఉగ్రవాది లెట్‌కొసెన్.. మే 5న జరిగిన ఇద్దరు కూకి రెవల్యూషనరీ ఆర్మీ(కేఆర్‌ఏ) మిలిటెంట్‌ల హత్యలో నిందితుడుగా ఉన్నాడని డీజీపీ ఎల్‌ఎం ఖౌతే విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అతడి వద్ద ఓ పిస్టల్‌తో పాటు ఆరు రౌండ్ల బుల్లెట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొయ్‌జామ్ వర్జిత్ అనే ఆర్‌పీఎఫ్ ఉగ్రవాదిని జూన్ 8వ తేదీన అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
Published Sun, Jun 11 2017 8:11 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
Advertisement
Advertisement