
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో 115 మంది ఉగ్రవాదులు రహస్యంగా దాక్కున్నారని ఆర్మీ మేజర్ జనరల్ బీఎస్ రాజు తెలిపారు. పుల్వామా ఎన్‌కౌంటర్‌పై స్పందించిన ఆయన ఉగ్రవాదులను ఏరేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లో మొత్తం 115 మంది ఉగ్రవాదులు ఉన్నారని.. అందులో 99 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారని ఆయన తెలిపారు.
పాకిస్తాన్‌నుంచి ఉగ్రవాదులు దేశంలోరి చొరబడుతున్నారని రాజు తెలిపారు. గత ఆరు నెలల్లో ఇలా చొరబడ్డ, స్థానిక ఉగ్రవాదులతో కలిపి మొత్తం 80 మందిని భద్రతాదళాలు ఏరేశాయని ఆయన తెలిపారు. లోయలోని యువత ఎవరూ పొరపాటున కూడా ఉగ్రవాదులతో కలవద్దని చెప్పారు.
115 terrorists prsnt in S Kashmir,99 local terrorists&15 foreign terrorists; 80 terrorists killed in last 6 mnths: BS Raju,GOC Victor Force pic.twitter.com/AaTPFEvKHY
— ANI (@ANI) November 3, 2017
Comments
Please login to add a commentAdd a comment