మరో పురాతన ఆలయం కూల్చేశారు | Militants Damage a Temple in Palmyra | Sakshi
Sakshi News home page

మరో పురాతన ఆలయం కూల్చేశారు

Published Mon, Aug 31 2015 8:56 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

మరో పురాతన ఆలయం కూల్చేశారు

మరో పురాతన ఆలయం కూల్చేశారు

పామిరా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సిరియాలోని ప్రముఖ పురాతన బాల్ ఆలయంపై మరోసారి విరుచుపడ్డారు. పురాతన క్షేత్రం వద్ద కొలువై ఉన్న సిరియన్ల ప్రముఖ దైవం బాల్ ఆలయాలను ఒక్కొక్కటీగా ధ్వంసం చేస్తున్నారు. గతవారం ఓ ఆలయాన్ని బాంబు దాడులో కూల్చివేయగా.. తాజాగా మరో ప్రముఖ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసి నేలమట్టం చేశారు.

క్రీ.శ 32లో నిర్మించిన ఈ ఆలయానికి దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఘటనను పరిశీలించిన స్థానికుడు అదొక మహా విస్ఫోటనంగా అభివర్ణించాడు. వారు పేల్చిన బాంబుకు వెలువడిన శబ్ధం విన్నవారి చెవులకు చిల్లులు పడాల్సిందే, వినికిడి లోపం సమస్య తలెత్తాల్సిందే అని చెప్పారు. షాటిలైట్లో కూడా ఆలయం ధ్వంసం సమయంలో ఏర్పడిన దుమ్ము దూళి పొగ భారీగా ఎగిసిపడటం కనిపించింది. ఈ ప్రాంతానికి యునస్కో హెరిటేజ్ గుర్తింపు కూడా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement