ఇస్లామాబాద్ : పాకిస్తాన్ జరిపిన మిలిటరీ ఆపరేషన్లో సుమారు 27మంది ఉగ్రవాదులతో పాటు అయిదురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. పాకిస్తాన్ ప్రభుత్వం గురువారం ఖైబర్ ఏజెన్సీలో ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR ఐఎస్పీఆర్) వెల్లడించిన వివరాలు ప్రకారం పాక్ సమాఖ్య పరిపాలిత గిరిజన ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారంతో దాడులు చేసినట్లు తెలిపింది. ఖైబర్ ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన ఈ ఆపరేషన్లో సుమారు 27 ఉగ్రవాదులు హతమవ్వగా, కెప్టెన్తో సహా అయిదుగురు భద్రతా సిబ్బంది మరణించారు.
పాక్లో 27మంది ఉగ్రవాదులు హతం
Published Fri, May 1 2015 8:29 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM
Advertisement
Advertisement