సరిహద్దుల్లో కాల్పులు: 14 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ - అప్ఘానిస్థాన్ సరిహద్దు ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతం దండీ కచ్ ప్రాంతం మంగళవారం రక్తసిక్తంగా మారింది. ఆఫ్ఘానిస్థాన్కు చెందిన తీవ్రవాదుల బృందం పాక్ సరిహద్దు వద్ద పహారా కాస్తున్న సైనికులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడింది. సైనికులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో సైనికులు ఎదురు కాల్పులకు దిగారు.
ఇరుపులా హోరాహోరి కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. వారిలో 11 మంది తీవ్రవాదులు కాగా, ముగ్గురు సైనికులని మీడియా మంగళవారం తెలిపింది. భద్రత దళాలు ఓ తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. అయితే అంతముందు అంటే ఈ రోజు ఉదయం కైబర్ ప్రాంతంలో వైమానిక దాడులలో ఐదు శిబిరాలను నాశనం కాగా, 20 మంది తీవ్రవాదులు మృతి చెందారని పేర్కొంది.