రెబల్స్ పై ఇరాక్ బలగాల పైచేయి
రెండు పట్టణాలు తిరిగి స్వాధీనం
బాగ్దాద్: మిలిటెంట్లతో పోరులో పైచేయి సాధించామని ఇరాక్ ప్రభుత్వ బలగాలు తెలిపాయి. బాగ్దాద్ సమీపంలోని రెండు పట్టణాలను తిరుగుబాటుదారుల చేతుల్లోంచి తిరిగి చేజిక్కించుకున్నామని, వారిని వెనక్కి తరిమికొడుతున్నామని ఆర్మీ కమాండర్లు ఆదివారం వెల్లడించారు. ప్రభుత్వ బలగాలు గత 24 గంటల్లో 279 మంది మిలిటెంట్లను హతమార్చాయని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. పోరులో పైచేయి సాధించామని ప్రధాని నూరీ అల్ మాలికి ఈ ప్రతినిధి కాసెమ్ అత్తా తెలిపారు. షియా మతపెద్ద అయతొల్లా అలీ అల్‌సిస్తానీ పిలుపుపై వలంటీర్లు పెద్ద సంఖ్యలో ఆర్మీలో చేరనున్నట్లు తెలిపారు. మరోపక్క.. ఖాలెస్ పట్టణంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రాంతంలో జరిగిన దాడిలో ముగ్గురు పోలీసులు సహా ఆరుగురు చనిపోయారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్‌ఐఎల్) జీహాదీ గ్రూపు నేతృత్వంలో సోమవారం తిరుగుబాటు లేవదీసిన మిలిటెంట్లు ఓ రాష్ట్రాన్ని పూర్తిగా, మరో మూడు రాష్ట్రాల్లోని అధిక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో దేశంలో అంత్యర్యుద్ధం మొదలైంది. సంక్షోభం నేపథ్యంలో అమెరికా గల్ఫ్‌కు విమాన వాహక నౌకను పంపింది. తిరుగుబాటును అణిచే శక్తి ఇరాక్‌కు ఉందని, విదేశీ సైనిక జోక్యం వద్దని ఇరాన్ హెచ్చరించింది.
ఇరాక్‌కు వెళ్లొద్దు: భారత్.... హింసతో అట్టుడుకుతున్న ఇరాక్‌కు ప్రయాణాలు మానుకోవాలని తమ పౌరులకు భారత ప్రభుత్వం సూచించింది. ఇరాక్‌లోని భారతీయులు జాగ్రత్తలు తీసుకోవాలని, స్వదేశానికి వచ్చే అంశంపై ఆలోచించుకోవాలని విదేశాంగ శాఖ పేర్కొంది. సాయం కోసం 964770444 4899/4899(మొబైల్), 964770484 3247/3247(మొ