ఎన్నికల వేళ జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు.
శ్రీనగర్ : ఎన్నికల వేళ జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మరో మూడురోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్లో పర్యటించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో సంచలనం సృష్టించేందుకు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. జమ్మూ,కశ్మీర్లో అయిదు దశల పోలింగ్లో భాగంగా రెండు విడతలు పూర్తికాగా, ఈనెల 9వ తేదీన మూడోదశ పోలింగ్ జరగనుంది.
కాగా శుక్రవారం తెల్లవారుజాము 3.30గంటల నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో ఇద్దరు జవాన్లు, ముగ్గురు పోలీసులు మృతి చెందారు. మరోవైపు ఎదురు కాల్పుల్లో నలుగురు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు.