
లష్కరే టాప్ మిలిటెంట్ హతం
శ్రీనగర్: జమ్మూక శ్మీర్‌లో మిలిటెంట్లపై పోరులో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ ఇర్షద్ గానీని శనివారం ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయి. పుల్వామా జిల్లా కాకపోరా ప్రాంతంలోని బేగమ్ బాగ్ గ్రామం వద్ద మిలిటెంట్లు ఉన్నారని సమాచారం రావడంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లగా మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు.
వెంటనే ఆర్మీ రంగంలోకి దిగి, పోలీసులతో కలసి గానీని మట్టుబెట్టింది. మిగతా మిలిటెంట్ల కోసం గాలిస్తున్నారు. కాకపోరాకే చెందిన ఇర్షద్ తలపై రూ. 10 లక్షల రివార్డు ఉంది. 2013లో హైదర్‌పోరాలో 8 మంది జవాన్లను చంపిన కేసుతోపాటు ఆర్మీ, పోలీసులపై జరిగిన పలు దాడుల కేసుల్లో అతడు నిందితుడు.