తీవ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య హోరాహోరీ కాల్పులు | Encounter between militants, security forces in Kupwara in J-K | Sakshi
Sakshi News home page

తీవ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య హోరాహోరీ కాల్పులు

Published Thu, Dec 18 2014 9:15 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

Encounter between militants, security forces in Kupwara in J-K

శ్రీనగర్ : కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య గురువారం మరోసారి హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. కుప్వారా జిల్లాలోని బాజ్పోరా ప్రాంతంలో తీవ్రవాదులు తలదాచుకున్నారని భద్రత సిబ్బందికి సమాచారం అందింది. దాంతో వారు బాజ్పోరా ప్రాంతంలో్ తనిఖీలు చేపట్టారు.

ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు ...  భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. వారు వెంటనే అప్రమత్తమై తీవ్రవాదులపై కాల్పులు జరిపారు. ఇరువైపులా హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి.  ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించాడు. ముందుగా భద్రతాదళాల మీద తీవ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఓ తీవ్రవాది హతమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement