జమ్మూకాశ్మీర్లో మరోసారి తుపాకుల చప్పుడు వినిపించింది. కుప్వారా జిల్లాలోని లాల్ పోరా ప్రాంతంలోగల షేక్ పురాలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మరోసారి తుపాకుల చప్పుడు వినిపించింది. కుప్వారా జిల్లాలోని లాల్ పోరా ప్రాంతంలోగల షేక్ పురాలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్కు సరిగ్గా 100 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉగ్రవాదుల అలికిడి ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, సైనికులు కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. వారికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎదురుపడి కాల్పులు జరపడంతో ప్రతిగా బలగాలు కాల్పులు జరిపాయి. అయితే, జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.