'కుటుంబాలు మీకూ ఉన్నాయ్.. జాగ్రత్త'
'కుటుంబాలు మీకూ ఉన్నాయ్.. జాగ్రత్త'
Published Thu, Mar 9 2017 7:34 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM
శ్రీనగర్: పోలీసుల కుటుంబాలపై టెర్రరిస్టులు దాడులు చేయడంపై జమ్మూకశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్‌పీ వేడ్ మిలిటెంట్లకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల ఇళ్లపై దోపిడీలకు దిగి బెదిరింపులకు పాల్పడే వారికి కూడా కుటుంబాలు ఉన్నాయనే సంగతి గుర్తించుకుని ప్రవర్తిస్తే మంచిదని అన్నారు. అనవసరంగా కుటుంబాలను సమస్యల్లోకి లాగొద్దని చెప్పారు.
పోలీసుల కుటుంబాలను వేధిస్తే.. అదే తరహాలో తాము కూడా ఉగ్రవాదుల కుటుంబాలను వేధిస్తామని అన్నారు. మంగళవారం ఓ పోలీసు ఇంట్లో చొరబడిన ఉగ్రవాదులు సొత్తు దోచుకుని వెళ్తూ ఉద్యోగం మాన్పించాలని అతని కుటుంబసభ్యులను బెదిరించారు. గత శనివారం షోపియన్‌లో జరిగిన మరో సంఘటనలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇంటిపై దాడి చేసిన పది మంది మిలిటెంట్లు ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసి ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరించారు. ఘటనలను సీరియస్‌గా తీసుకున్న డీజీపీ వేడ్ టెర్రరిస్టులకు హెచ్చరికలు చేశారు.
Advertisement
Advertisement