మణిపూర్‌లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబీసింగ్ నివాస ప్రాంగణంలో శనివారం సాయంత్రం 6:35 గంటలకు శక్తివంతమైన గ్రెనేడ్ పేలుడు సంభవించింది.
ఇంఫాల్: మణిపూర్‌లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబీసింగ్ నివాస ప్రాంగణంలో శనివారం సాయంత్రం 6:35 గంటలకు శక్తివంతమైన గ్రెనేడ్ పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. పంద్రాగస్టు వేడుకలను దెబ్బతీసేందుకు మిలిటెంట్లే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. పేలుడు అనంతరం పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలతోపాటు బిషెన్‌పూర్, తౌబల్ జిల్లాల్లో అన్ని పోలీసు స్టేషన్లు, పోలీసు ఔట్‌పోస్టులను అప్రమత్తం చేశారు.