మణిపూర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం | Three militants killed in interior Manipur | Sakshi
Sakshi News home page

మణిపూర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

Nov 13 2013 11:24 AM | Updated on Sep 2 2017 12:34 AM

మణిపూర్లో రెండు తీవ్రవాద గ్రూపుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉద్రవాదులు హతమయ్యారు.

మణిపూర్లో రెండు తీవ్రవాద గ్రూపుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉద్రవాదులు హతమయ్యారు. నాగాలాండ్ జాతీయ సామాజిక కౌన్సిల్-ఇసాక్, మూవా దళానికి, జిలియన్గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు బుధవారం పోలీసులు తెలిపారు. బాంబులు, ఆధునిక ఆయుధాలతో పరస్పరం దాడులకు పాల్పడినట్టు చెప్పారు.

టమెన్గ్లాంగ్ జిల్లాలో ఐదు గంటల పాటు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో జిలియన్గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్కు ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా,  నాగాలాండ్ జాతీయ సామాజిక కౌన్సిల్కు చెందిన మరి కొందరు గాయపడినట్టు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement