ఆదివారం జరిగిన రెండు దాడుల్లో 29 మంది మరణించగా, చాలా ఇళ్లు ధ్వంసమయిన కెన్యా అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
నైరోబి: కెన్యా మరోసారి ఉగ్రవాద దాడులతో అట్టుడికింది. ఆదివారం జరిగిన రెండు దాడుల్లో 29 మంది మరణించగా, చాలా ఇళ్లు ధ్వంసమయిన కెన్యా అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
లామూ కౌంటీలోని హిండిలో వాణిజ్య కేంద్రంపైనా, టనా రివర్ కౌంటీలోని గాంబా పోలీస్ స్టేషన్పైనా సాయుధులు దాడి చేశారు. ఈ దాడుల వెనుక తమ హస్తం ఉన్నట్టు సొమాలీ ఉగ్రవాద ఇస్లామిక్ గ్రూప్ అల్ షబాబ్ ప్రకటించింది. ఈ ప్రాంతంలో ఇటీవల చాలా సార్లు దాడులకు పాల్పడింది.