
70 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు
మొగాదిషు: ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమాలియాలో 70 మంది ఉగ్రవాదులను ప్రభుత్వ బలగాలు మట్టుబెట్టాయి. మరో 30 మందిని బంధించాయి. సైనికాధికారులు సోమవారం ఈ విషయాన్ని ప్రకటించాయి.
ఉత్తర సోమాలియాలోని నుగల్ ప్రాంతంలోని సుజ్ వ్యాలీలో ప్రభుత్వ బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకరమైన పోరు గత నాలుగు రోజులుగా జరుగుతుందని పుంట్లాండ్ మంత్రి తెలిపారు. 'మేం అల్ షహబ్ సంస్థకు చెందిన 70 మందిని హతమార్చాం. 30 మందిని అరెస్టు చేశాం. ఉగ్రవాదులపై ఇది సైన్యం సాధించిన విజయం అని ఆయన చెప్పారు. మొత్తం 500 మందిని చుట్టుముట్టామని త్వరలోనే మిగితావారి ఆటకట్టవుతుందని తెలిపారు.