పాకిస్థాన్లో వైమానిక దాడి జరిగి 21మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్థాన్- అఫ్గనిస్థాన్ సరిహద్దులో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో వైమానిక దాడి జరిగి 21మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్థాన్- అఫ్గనిస్థాన్ సరిహద్దులో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ నెలలో ఇది ఉగ్రవాదులకు మరో గట్టి దెబ్బ. ఈ నెల 11న కూడా ఓసారి పాక్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు వైమానిక దాడులు జరపగా 22మంది హతమయ్యారు.
ఖైబర్ ఏజెన్సీలోని రాజ్గల్, తిరాహ్ ప్రాంతాల్లో గురువారం అనూహ్యంగా తాము ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాల్లో దాడులు జరిపామని, గత కొద్ది రోజులుగా ఉగ్రవాదులను అణిచివేసే చర్యల్లో భాగంగా అటు అప్గనిస్థాన్కు కూడా సహాయపడేలా దాడులు నిర్వహిస్తున్నామని పాక్ సైనిక వర్గాలు తెలిపాయి.