జమ్మూ: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు జమ్మూకాశ్మీర్ సరిహద్దున హింస చెలరేగింది. శుక్రవారం ఉదయం జమ్మూ జిల్లాలో భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ కాల్పులు జరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం మోదీ జమ్మూ రానున్నారు. ఆ రాష్ట్ర రెండో విడత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార సభల్లో మోదీ పాల్గొననున్నారు.
గురువారం కూడా జమ్మూ జిల్లాలోని ఆర్నియా వద్ద ఉగ్రవాదులు భారత స్థావరాలపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు, నలుగురు పౌరులు, ఇద్దరు జవాన్లు మరణించారు.
మోదీ పర్యటనకు ముందు జమ్మూలో కాల్పులు
Published Fri, Nov 28 2014 10:47 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement