ఎన్కౌంటర్లో నలుగురు మృతి | Four killed in Kashmir gunfight | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్లో నలుగురు మృతి

Published Sat, Jul 30 2016 1:10 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

ఎన్కౌంటర్లో నలుగురు మృతి

ఎన్కౌంటర్లో నలుగురు మృతి

శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని నౌగామ్ సెక్టార్లో శనివారం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వద్ద అక్రమంగా భారత్లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులు.. పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చొరబాటుదారులు సైతం మృతి చెందారు. ఉగ్రవాదుల చొరబాటుని సమర్థవంతంగా తిప్పికొట్టామని భద్రతాబలగాలు ప్రకటించాయి. అయితే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement